త్రీ ఖాన్స్ ఇన్ వన్ ఫ్రేమ్!

ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలుస్తుంది..

  • Published By: sekhar ,Published On : November 4, 2019 / 08:39 AM IST
త్రీ ఖాన్స్ ఇన్ వన్ ఫ్రేమ్!

ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలుస్తుంది..

ముగ్గురు బాలీవుడ్ సూపర్‌స్టార్స్.. దశాబ్దాల కాలంగా హిందీ సినీ పరిశ్రమను ఏలుతున్న హీరోలు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఈ ముగ్గురూ కలిసి ఒకే ఫ్రేములో కనబడితే ఎలా ఉంటుంది? అభిమానుల ఆనందాని అంతే ఉండదు.. 

ఆమిర్ కొత్త సినిమా ‘లాల్‌సింగ్‌ చద్దా’ షూటింగ్ ఇటీవలే అంథేరిలోని యశ్ రాజ్ స్టూడియోలో ప్రారంభమైంది.. ఆమిర్ తల్లి జీనత్ హుస్సేన్ క్లాప్ కొట్టడం విశేషం. రాబర్ట్ జిమికిస్ డైరెక్ట్ చేయగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న హాలీవుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’కి హిందీ రీమేక్‌ ఇది.. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తుండగా, కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.

Read Also : మహేష్, ప్రభాస్ ఇద్దరిలో ఎవరో?

‘లాల్ సింగ్ చద్దా’లో షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు ఈ ఖాన్స్ ముగ్గురూ ఒకరి సినిమాల్లో ఒకరు అతిథి పాత్రల్లో కనిపించారు కానీ ముగ్గురూ కలిసి స్క్రీన్‌పై కనిపించలేదు. త్వరలోనే ఖాన్స్‌ ముగ్గురినీ ఒకే ఫ్రేమ్‌లో చూడొచ్చు అని బాలీవుడ్‌ మీడియా కథనం.. వయాకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 క్రిస్మస్‌కు రిలీజ్ చేయనున్నారు.