Aamir Khan : సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు.. హిట్ కొట్టి ఆరేళ్ళు .. ఈ సినిమాపైనే ఆశలు..

అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య లీడ్ రోల్స్ లో అమెరికన్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా ఆగస్ట్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు అమీర్. 2016లో దంగల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత........

Aamir Khan : సినిమా రిలీజ్ అయి నాలుగేళ్లు.. హిట్ కొట్టి ఆరేళ్ళు .. ఈ సినిమాపైనే ఆశలు..

Aamir Khan :  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కి హిట్, ఫ్లాప్ తో సంబందం లేని క్రేజ్ ఉంది. ఆయన సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమా ఏదైనా సెన్సిబుల్ గా తెరకెక్కించే అమీర్ ఖాన్. కెరీర్ లోనే బిగ్గెస్ట్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు ప్రస్తుతం. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్ గా, బెస్ట్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్న అమీర్ ఖాన్ సినిమాలో కమర్షియాలిటీ కన్నా కంటెంట్ నే ప్రిఫర్ చేస్తారు. అందుకే మిగతా స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలు చేస్తుంటే అమీర్ ఎక్కువగా సెన్సిబుల్ మూవీస్ చేస్తుంటారు. ఈ లిస్ట్ లోనే లేటెస్ట్ గా లాల్ సింగ్ చద్దా మూవీ చేశారు అమీర్ ఖాన్. 4 ఏళ్ల తర్వాత మోస్ట్ వెయిటింగ్ మూవీగా రిలీజ్ అవుతున్న ఆనందం కంటే ఎక్కువ వర్రీ అవుతున్నారు అమీర్ ఖాన్.

అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య లీడ్ రోల్స్ లో అమెరికన్ మూవీ ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా ఆగస్ట్ 11న రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం బిగ్గెస్ట్ స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు అమీర్. 2016లో దంగల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వకపోవడం, చివరి సారిగా 2018లో వచ్చిన థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ డిజాస్టర్ అవ్వడం, ఆ తరవాత ఏ సినిమా చెయ్యకపోవడంతో లాల్ సింగ్ చద్దా మీద అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

Koffee with Karan : సమంతని ఎత్తుకొని తిప్పేసిన అక్షయ్.. రణ్‌వీర్‌సింగ్‌ తో డ్యాన్స్ చేస్తా అంటున్న సమంత..

ఈ అంచనాల విషయంలోనే టెన్షన్ పడుతున్నారు అమీర్. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన టీజర్లు, సాంగ్స్ మీద హైప్ ఉన్నా ఆడియన్స్ లో సరిగా బజ్ క్రియేట్ అవ్వకపోవడంతో వర్రీ అవుతున్నారు అమీర్. సినిమా జడ్జిమెంట్ మీద చాలా మంది దగ్గర ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు అమీర్ ఖాన్. లాల్ సింగ్ చద్దాతో మరోసారి తెలుగు ఆడియన్స్ ని పలకరిస్తున్న అమీర్ ఇక్కడి ఆడియన్స్ పల్స్ తెలుసుకోవడానికి చిరంజీవి, రాజమౌళి, సుకుమార్ లాంటి టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలకు సినిమా స్పెషల్ ప్రీమియర్ కూడా వేశారు. ఈ సినిమా చూసి అందరూ ఎమోషనల్ అయ్యారు. ప్రివ్యూ చూసిన స్టార్లు కూడా ఆహా ఓహో అన్నారు. అయినా అమీర్ మాత్రం ఇంకా రిలీజ్ స్ట్రెస్ నుంచి బయటకురాలేదు. సినిమాకు సంబందించి సోషల్ మీడియా ప్రమోషన్లు గట్టిగానే జరుగుతున్నా ఆడియన్స్ అంచనాలను అందుకోవడం ఎలా అన్న విషయంలో అమీర్ మాత్రం ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఆగస్టు 11న ఈ సినిమా దేశ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.