లాల్ సింగ్ చద్దా – ఫస్ట్‌లుక్

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నహాలీవుడ్‌చిత్రం ‘ఫారెస్ట్‌గంప్‌’ హిందీ రీమేక్‌ ‘లాల్ సింగ్ చద్దా’ - ఫస్ట్‌లుక్..

  • Published By: sekhar ,Published On : November 18, 2019 / 05:36 AM IST
లాల్ సింగ్ చద్దా – ఫస్ట్‌లుక్

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్నహాలీవుడ్‌చిత్రం ‘ఫారెస్ట్‌గంప్‌’ హిందీ రీమేక్‌ ‘లాల్ సింగ్ చద్దా’ – ఫస్ట్‌లుక్..

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ కొత్త సినిమా ‘లాల్‌ సింగ్‌ చద్దా’ షూటింగ్ ఇటీవలే అంథేరిలోని యశ్ రాజ్ స్టూడియోలో ప్రారంభమైంది.. ఆమిర్ తల్లి జీనత్ హుస్సేన్ క్లాప్ కొట్టడం విశేషం. రాబర్ట్ జిమికిస్ డైరెక్ట్ చేయగా ఆస్కార్ అవార్డ్ అందుకున్న హాలీవుడ్‌చిత్రం ‘ఫారెస్ట్‌గంప్‌’ మూవీకిది హిందీ రీమేక్‌.. ‘సీక్రెట్ సూపర్‌స్టార్’ ఫేమ్ అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తుండగా, కరీనా కపూర్ కథానాయికగా నటిస్తోంది.

సోమవారం ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. ఏ క్యారెక్టర్ చేసినా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఇన్‌వాల్వ్ అయ్యే ఆమిర్.. లాల్ సింగ్ గెటప్‌లో పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. గుబురు గెడ్డంతో, మీసాలు మెలితిప్పి, సిక్కుల సాంప్రదాయమైన తలపాగ (టర్బన్)తో, ఒక చేతికి కడియం, మరో చేతికి వాచ్, ఒళ్లో గిఫ్ట్ బాక్స్.. అన్నిటికీ మించి కళ్లు పెద్దవి చేసి చూస్తున్న తీక్షణమైన చూపు.. ఆమిర్ లుక్ అదిరిపోయింది.

Read Also : సంతానం హీరోగా ‘డిక్కీలోనా’ ప్రారంభం

‘లాల్ సింగ్ చద్దా’లో షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌కీలక పాత్రల్లో నటించనున్నారని తెలిస్తుంది. వయాకామ్ 18 స్టూడియోస్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. 2020 క్రిస్మస్‌కు రిలీజ్ చేయనున్నారు. మ్యూజిక్ : ప్రీతమ్, స్క్రీన్‌ప్లే : ఎరిక్ రోత్, ఇండియన్ అడాప్షన్ : అతుల్ కులకర్ణి, లిరిక్స్ : అమితాబ్ భట్టాచార్య, నిర్మాణం : ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, వయాకామ్ 18 స్టూడియోస్.