“చిరంజీవి”oచిన చిత్రం ‘ఆపద్బాంధవుడు’ కి 28 సంవత్సరాలు!

  • Published By: sekhar ,Published On : October 8, 2020 / 08:44 PM IST
“చిరంజీవి”oచిన చిత్రం ‘ఆపద్బాంధవుడు’ కి 28 సంవత్సరాలు!

Chiranjeevi – Aapadbandhavudu: మెగాస్టార్ చిరంజీవి, కళాతపస్వి కె.విశ్వనాథ్, అభిరుచిగల నిర్మాత, పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావుల కలయికలో ‘స్వయంకృషి’ తర్వాత తెరకెక్కిన అపురూప చిత్రం.. ‘ఆపద్బాంధవుడు’.. 1992 అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రం 2020 అక్టోబర్ 9 నాటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.



చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రమిది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో మిస్ అయ్యింది . అలాగే 5 నంది అవార్డులు గెలుచుకుందీ చిత్రం. మాధవగా చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరు ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే శివుని పాత్రలో సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యినట్టు ఉంటుంది.



మీనాక్షి శేషాద్రి కథానాయకిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. అలాగే ఎం ఎం కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. కె.విశ్వనాథ్‌ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో రూపొందిన ఆఖరు చిత్రం కూడా ఇదే. ఈ సినిమా తరువాత నిర్మాణానికి దూరమయ్యారు ఏడిద నాగేశ్వరరావు. అయితే నిర్మాతగా మాత్రం ఆయన్ని అన్ని విధాలా సంతృప్తిపరచిన చిత్రమిది. పూర్ణోదయ సంస్థ ప్రతిష్టని మరింత ఇనుమడింప చేసింది.



జంధ్యాల తొలిసారి మేకప్‌ వేసుకొన్న చిత్రమిది. ఈ సినిమాకి సంభాషణలు అందించిన జంధ్యాల..ఇందులోని పరంధామరాజు పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర నేనే చేస్తా అని ఏడిద నాగేశ్వరరావుకి ఓ చీటి రాసిచ్చారు. చివరికి కె.విశ్వనాథ్‌ కూడా ఓకే అనడంతో తొలిసారి జంధ్యాల మేకప్‌ వేసుకొన్నారు. ఆయన నటించిన మొదటి మరియు చివరి చిత్రం ఇదే.

Aapadbandhavudu

Aapadbandhavudu

Aapadbandhavudu

Aapadbandhavudu Aapadbandhavudu Aapadbandhavudu