Victory Venkatesh : ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ సరసన ఆశ్రిత దగ్గుబాటి

హీరో విక్టరీ వెంకటేష్ పెద్దకూతురు ఆశ్రిత అరుదైన రికార్టును సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్చేస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్‌ పేరుతో అకౌంట్‌ క్రియేట్‌ చేసి వంటల వీడియోలు షేర్ చేస్తారు ఆశ్రిత. ఆలా షేర్ చేసిన ఒక్కో వీడియోకు ఆమె 400 డాలర్లు తీసుకుంటారట.

Victory Venkatesh : ప్రియాంక చోప్రా, విరాట్ కోహ్లీ సరసన ఆశ్రిత దగ్గుబాటి

Victory Venkatesh

Victory Venkatesh : హీరో విక్టరీ వెంకటేష్ పెద్దకూతురు ఆశ్రిత అరుదైన రికార్టును సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్చేస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్‌ పేరుతో అకౌంట్‌ క్రియేట్‌ చేసి వంటల వీడియోలు షేర్ చేస్తారు ఆశ్రిత. ఆలా షేర్ చేసిన ఒక్కో వీడియోకు ఆమె 400 డాలర్లు తీసుకుంటారట.

తాజాగా హోపర్‌ డాట్‌ కం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377 స్లానంలో నిలవగా ఆసియాలో 27వ స్థానంలో ఉన్నారు. కాగా ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌ 1.3 లిమిలియన్స్ ఫాలోవర్స్‌ ఉన్నారు. అతి కొద్దీ మంది భారతీయులు ఉన్న ఈ జాబితాలో ఆశ్రిత చోటు దక్కించుకోవడం విశేషం.

ఇక ఈ లిస్ట్ లో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఫుట్ బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో ఉండగా, wwe ఫైటర్, హాలీవుడ్ నటుడు డ్వైన్ జాన్సన్ రెండవ స్థానంలో ఉన్నారు. ఇక భారత్ విషయానికి వస్తే.. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉండగా.. నటి ప్రియాంక చోప్రా రెండవ స్థానంలో ఉన్నారు.