34 సంవత్సరాల ఆత్మబలం

34 సంవత్సరాల ఆత్మబలం

34 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆత్మబలం..

34 సంవత్సరాల ఆత్మబలం

34 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆత్మబలం..

నందమూరి బాలకృష్ణ, భానుప్రియ జంటగా, తాతినేని ప్రసాద్ దర్శకత్వంలో, జె.ఎమ్.నాయుడు, కె.ముత్యాల రావు నిర్మించిన సినిమా.. ఆత్మబలం..
1985 వ సంవత్సరం, జనవరి 24 న విడుదలైన ఈ సినిమా, 2019 జనవరి 24 నాటికి 34 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చక్రవర్తి సంగీత మందించిన ఆత్మబలం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఫేమస్ పాప్ సింగర్ దుర్గా ప్రసాద్‌గా బాలకృష్ణ ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంటాడు. ఆత్మబలంలో బాలకృష్ణ, భానుప్రియల కెమిస్ట్రీ బాగుంటుంది. ఊటీలోని అందమైన లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్ జరిపారు.

ముఖ్య పాత్రల్లో అంజలీ దేవి, కైకాల సత్యనారాయణ, ఎమ్.ఎన్.నంబియార్, మిక్కిలినేని, శరత్ బాబు, సిల్క్ స్మిత తదితరులు నటించగా, సుభాష్ ఘయ్ కథ, గణేష్ పాత్రో మాటలు అందించారు. చలి చలిగా, ఆకాశ వీధిలో, ఓం శాంతి ఓం, వన్నెల చిన్నెల, చలిగాడు ఏం చేస్తాడే వంటి పాటలు ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి కెమెరా : నవకాంత్, ఎడిటింగ్ : కె.సత్యం. బ్యానర్ : శ్రీవళ్ళీ ప్రొడక్షన్స్.

వాచ్ ఆత్మబలం సాంగ్స్…

×