Abhishek Agarwal : ‘కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత బిజెపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ??

ఇటీవల 'ది కశ్మీర్ ఫైల్స్' అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులందరిని కంటతడి పెట్టించింది. ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు, ప్రధాని మోడీ సైతం ఈ సినిమాని అభినందించారు.

Abhishek Agarwal : ‘కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత బిజెపి నుంచి ఎమ్మెల్యేగా పోటీ??

Abhishek Agarwal

Abhishek Agarwal :  కాశ్మిర్ పండిట్లను, కశ్మీర్ లోని హిందువులని 90 వ దశకంలో టెర్రరిస్టులు, పాకిస్థాన్ సపోర్టర్స్ ఎంతో దారుణంగా చంపేశారు. దీంతో చాలా మంది కశ్మీర్ ని వదిలి వెళ్లిపోయారు. దీనిని ఆధారంగా తీసుకొని ఇటీవల ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకులందరిని కంటతడి పెట్టించింది. ప్రేక్షకుల నుంచి సెలబ్రిటీల వరకు, ప్రధాని మోడీ సైతం ఈ సినిమాని అభినందించారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ విజయం సాధించింది ఈ సినిమా.

 

భారతీయత అనే విషయాల్లో బిజెపి నాయకులు ముందుంటారు. అలాంటి అంశాలతో తీసిన సినిమా, నిజంగా జరిగిన కథతో తెరకెక్కిన సినిమా కావడంతో అందరితో పాటు అన్ని రాష్ట్ర బీజేపీ నాయకులు, ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు ఈ సినిమాని అభినందించడమే కాక చిత్ర యూనిట్ ని పిలిచి మరీ సన్మానం చేశారు. నరేంద్ర మోడీతో పాటు యోగి ఆదిత్యనాథ్, అమిత్ షా, కిషన్ రెడ్డి లాంటి బిజెపి ప్రముఖులు చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా పిలిచి మరీ అభినందించారు. దీంతో ఈ సినిమా యూనిట్ కి బిజెపి నాయకులతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి.

The Kashmir Files: ఆగని కలెక్షన్లు.. 200 కోట్ల క్లబ్‌లోకి కాశ్మీర్ ఫైల్స్!

ఇక ఈ సినిమాని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ తెలుగు రాష్ట్రానికి చెందిన వాడు. హైదరాబాద్ లోనే ఇతని నివాసం. అభిషేక్ అగర్వాల్ గతంలో చాలా తెలుగు సినిమాలకి సపోర్ట్ గా నిలిచారు, కొన్ని సినిమాలని నిర్మించారు. ఇప్పుడు మరిన్ని తెలుగు సినిమాలని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘ది కాశ్మీర్ ఫైల్స్‌’తో మంచి పేరు తెచ్చుకున్నాడు.

The Kashmir Files : ఈ సినిమాతో బాలీవుడ్ పాపాలని కడిగేశారు.. ‘ది కశ్మీర్‌ ఫైల్స్’ సినిమాపై కంగనా వ్యాఖ్యలు..

ప్రస్తుతం ఈయన రవితేజతో ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు కిషన్ రెడ్డితో సహా తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో ఈయన 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేయాలని చూస్తున్నట్టు వినిపిస్తుంది. అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్‌లోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేయాలని యోచిస్తున్నట్లు తాజా సమాచారం. బిజెపికి తెలంగాణలో కొన్ని చోట్ల గట్టి నాయకులు లేరు కాబట్టి ఇతనికి టికెట్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మరి కశ్మీర్ ఫైల్స్ తో విజయం సాధించిన అభిషేక్ అగర్వాల్ బిజెపి తరపున రాబోయే ఎలక్షన్లలో పోటీ చేస్తాడా? చేసి గెలుస్తాడా? ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.