Abhishek Bachchan : హిందీ సినిమాలకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు.

అమితాబ్ తనయుడు బాలీవుడ్ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…''హిందీ సినిమాలకు ఎప్పట్నుంచో దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రాంతీయ సినిమాలకు..........

Abhishek Bachchan : హిందీ సినిమాలకి దేశవ్యాప్తంగా అభిమానులున్నారు.

Abhishek

 

Abhishek Bachchan :  ఇటీవల మన సౌత్ సినిమాలు దేశమంతటా, ముఖ్యంగా బాలీవుడ్ లో భారీ విజయాన్ని సాధించి అత్యధిక కలెక్షన్లు సాధిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా సౌత్ సినిమాల సక్సెస్ పై బాలీవుడ్ కుళ్ళుకుంటుంది. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో వరుసగా సక్సెస్ అయి, బాలీవుడ్ సినిమాలు పరాజయం పాలవుతుండటంతో కొంతమంది బాలీవుడ్ వర్గీయులు పని కట్టుకొని సౌత్ సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇక సౌత్ సినిమాల సక్సెస్ పై ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్స్ కామెంట్స్ చేయగా తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Nawazuddin Siddiqui : నేను సౌత్ సినిమాలు చూడలేదు.. బాలీవుడ్ లో ఒక్క హిట్ పడితే అంతా సెట్ అయిపోద్ది..

 

అమితాబ్ తనయుడు బాలీవుడ్ హీరో అభిషేక్‌ బచ్చన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…”హిందీ సినిమాలకు ఎప్పట్నుంచో దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ప్రాంతీయ సినిమాలకు కూడా మన దగ్గర మంచి ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. ఇది ఇప్పటి ట్రెండ్‌ కాదు, గతంలో కూడా ఎన్నో ప్రాంతీయ సినిమాలు మన దగ్గర విజయం సాధించాయి. కాకపోతే ఇటీవల ఇలాంటి సినిమాల సంఖ్య పెరిగింది. ఓ గొప్ప సినిమా ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు రీమేక్‌గా వెళ్తూ ఉంటుంది. అది చాలా సహజమైన విషయం. ఎవరు ఏ సినిమా చేసినా మనమంతా సినిమా పరిశ్రమలో భాగమే అని గుర్తుంచుకోవాలి” అని తెలిపారు.