Shahid Kapoor : ‘జెర్సీ’ షూటింగ్‌లో ప్రమాదం.. 25 కుట్లు పడ్డాయి: షాహిద్‌ కపూర్

నాని నటించిన 'జెర్సీ' సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా...........

Shahid Kapoor : ‘జెర్సీ’ షూటింగ్‌లో ప్రమాదం.. 25 కుట్లు పడ్డాయి: షాహిద్‌ కపూర్

Shahid

Shahid Kapoor :  షూటింగ్స్ లో ఒక్కోసారి ప్రమాదాలు కూడా ఎదురవుతాయి. సినిమా కోసం కొంతమంది ఆర్టిస్టులు రిస్కులు చేస్తారు. కొత్త కొత్తవి నేర్చుకుంటారు. ఈ నేర్చుకొనే ప్రాసెస్ లో, రిస్కులు చేసే టైంలో ఒక్కోసారి అనుకోకుండా ప్రమాదాలు ఎదురవుతాయి. చాలా మంది ఆర్టిస్టులు ఈ ప్రమాదాలకు గురయ్యారు. కోలుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అన్ని రోజులు షూటింగ్స్ ఆపేసి రెస్ట్ తీసుకుంటారు. ఇక హీరోలైతే సినిమా కోసం చాలా డెడికేషన్ తో పని చేయాలి. అందుకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. తాజాగా ఓ బాలీవుడ్ హీరోకి షూటింగ్ లో ప్రమాదం జరిగిన విషయం బయటకి వచ్చింది.

Bigg Boss 5 : నేను వెళ్తేనే నువ్వు గెలుస్తావు.. షణ్ను కోసం రవి త్యాగం?

నాని నటించిన ‘జెర్సీ’ సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల అవ్వబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా షాహిద్ మీడియాతో మాట్లాడారు. షూటింగ్లో జరిగిన కొన్ని విషయాలని మీడియాతో పంచుకున్నారు. ఇందులో భాగంగానే షూటింగ్ లో తనకి గాయమైన సంగతి తెలిపారు.

Bigg Boss 5 : బిగ్ బాస్ విజేతకు అదిరిపోయే ఆఫర్.. ప్రైజ్‌మనీ‌తో పాటు ఇల్లు కట్టుకోడానికి స్థలం కూడా..

‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్‌ సాధన చేస్తుంటే తాను తీవ్రంగా గాయపడినట్లు షాహిద్‌కపూర్‌ తెలిపారు. క్రికెట్ ప్రాక్టీస్ లో బౌలర్ విసిరిన బాల్ కింది పెదవికి బలంగా తాకడంతో చాలా పెద్ద గాయమైందని, దాదాపు 25 కుట్లు పడ్డాయని తెలిపారు. ”ఈ గాయం వల్ల నా పెదవి ఎప్పటికీ పనిచేయదని భయపడ్డాను. కదిలించడమే కష్టమైంది. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలల పాటు షూటింగ్‌ను ఆపివేశాం” అని షాహిద్ మీడియాతో చెప్పారు.