Ranbir Kapoor : రణబీర్ కారుకి యాక్సిడెంట్.. ఇవాళ నా అదృష్టం.. లేకపోతే..

కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ శుక్రవారం విడుదల అయింది. అయితే ముంబైలో ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరయ్యే క్రమంలో రణ్‌బీర్‌ కారుకు యాక్సిడెంట్‌ అయింది. ఈ ప్రమాదంలో.............

Ranbir Kapoor : రణబీర్ కారుకి యాక్సిడెంట్.. ఇవాళ నా అదృష్టం.. లేకపోతే..

Shamshera

Ranbir Kapoor :  బాలీవుడ్‌ యువ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో, సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే అలియా భట్ ని పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ, మరోపక్క వరుస సినిమాలు చేస్తున్నాడు. ఒకపక్క ఎప్పుడో రిలీజ్ ఉన్న బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ చేస్తూనే మరో పక్క తాజాగా షంషేరా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్‌ శుక్రవారం విడుదల అయింది. అయితే ముంబైలో ఈ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరయ్యే క్రమంలో రణ్‌బీర్‌ కారుకు యాక్సిడెంట్‌ అయింది. ఈ ప్రమాదంలో హీరోకు ఎలాంటి గాయాలు కాలేదు. తృటిలో ఈ ప్రమాదం నుంచి రణబీర్ తప్పించుకున్నారు. షంషేరా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో రణ్‌బీర్‌ తన కారుకు జరిగిన యాక్సిడెంట్‌ గురించి తెలియడంతో ఈ విషయం బయటపడింది.

Kartihkeya 2 : ఈ సారి కృష్ణుడి కోసం.. ద్వారకా నగరం ఏమైంది??.. అదరగొట్టిన కార్తికేయ 2 ట్రైలర్..

రణబీర్ ఈ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. ”నేను కరెక్ట్‌ టైంకి వచ్చేవాడినే. కానీ దారిలో ఓ వ్యక్తి మా కారును ఢీ కొట్టడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. అదృష్టమంటే ఇదే..లేకపోతే.. అదృష్టం వల్లే ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాం” అని తెలిపాడు. షంషేరా సినిమా జూలై 22న విడుదల కానుంది.