Acharya: ఆచార్య 10 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీ కొట్టేనా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద....

Acharya: ఆచార్య 10 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీ కొట్టేనా..?

Acharya 10 Days Worldwide Collections

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. అయితే ఈ సినిమాకు తొలిరోజే మిక్సిడ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపలేదు.

Acharya: మరో పది రోజుల్లో ఆచార్య వచ్చేస్తున్నాడా..?

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా వసూళ్లు చాలా వీక్‌గా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్స్ భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు డిస్ట్రిబ్యూటర్స్ ఏకంగా ఓపెన్ లెటర్ రాస్తూ తమను ఆదుకోవాలని ఆచార్య చిత్ర టీమ్‌ను కోరుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద 10 రోజుల రన్ కంప్లీట్ చేసిన ‘ఆచార్య’ ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.48.20 కోట్ల కలెక్షన్లు మాత్రమే వసూలు చేసింది.

Acharya: ఫోకస్ నెక్స్ట్.. ముగ్గురికి రూట్ క్లియర్ చేసిన ఆచార్య!

మెగాస్టార్ పర్ఫార్మెన్స్ బాగున్నా, ఈ సినిమా రొటీన్ కథ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ ప్రభావం చిత్ర కలెక్షన్లపై పడిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా చాలా రోజుల తరువాత మెగాస్టార్ చిత్రం వచ్చినా, అది ఫెయిల్యూర్‌గా మిగలడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇక ఆచార్య 10 రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాలు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

Acharya: ఓటీటీలోకి ఆచార్య.. ఎప్పుడంటే?

నైజాం – రూ.12.39 కోట్లు
సీడెడ్ – రూ.6.18 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.4.85 కోట్లు
ఈస్ట్ – రూ.3.24 కోట్లు
వెస్ట్ – రూ.3.40 కోట్లు
గుంటూరు – రూ.4.59 కోట్లు
కృష్ణా – రూ.3.08 కోట్లు
నెల్లూరు – రూ.2.94 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – రూ.40.64 కోట్లు (రూ.59.65 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – రూ.2.78 కోట్లు
ఓవర్సీస్ – రూ.4.75 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.48.20 కోట్లు (రూ.75.70 కోట్ల గ్రాస్)