Acharya: ఆచార్య 13 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీకి కూతవేటు దూరం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ...

Acharya: ఆచార్య 13 రోజుల వసూళ్లు.. హాఫ్ సెంచరీకి కూతవేటు దూరం!

Acharya 13 Days Worldwide Collections

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించడంతో ఈ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. అయితే సినిమా కథ ప్రేక్షకులను మెప్పించలేకపోయిందని.. అందుకే ఈ సినిమాకు యావరేజ్ రెస్పాన్స్ దక్కిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Acharya: మరో పది రోజుల్లో ఆచార్య వచ్చేస్తున్నాడా..?

ఇక ఈ సినిమాకు తొలిరోజు భారీ ఒపెనింగ్స్ అయితే వచ్చాయి. కానీ ఆ తరువాత ఆచార్య తన వసూళ్ల పరంపరను కొనసాగించలేకపోయాడు. ఈ సినిమా ఏప్రిల్ 29న రిలీజ్ కాగా, ఇప్పటివరకు ఇంకా రూ.50 కోట్ల షేర్ మార్క్‌ను టచ్ చేయలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమా 13 రోజుల థియేట్రికల్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.48.29 కోట్ల మేర షేర్ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించగా, చరణ్ ఓ కీలక పాత్రలో నటించాడు. అందాల భామ పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.

Akhanda-Acharya : అఖండ.. ఆచార్య.. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..

ప్రపంచవ్యాప్తంగా ఆచార్య సినిమా ఏకంగా రూ.131.20 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ఆచార్య చిత్రం కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా ద్వారా నష్టపోయామంటూ పలువురు డిస్ట్రిబ్యూటర్లు మెగాస్టార్ చిరంజీవికి ఓపెన్ లెటర్ రాసిన సంగతి తెలిసిందే. కాగా ఆచార్య సినిమా రూ.50 కోట్ల షేర్ వసూళ్ల మార్క్‌కు కూతవేటు దూరంలో ఉండటంతో, ఈ సినిమా టోటల్ రన్‌లో ఈ మార్క్‌ను దాటుతుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక ఆచార్య 13 రోజుల వరల్డ్‌వైడ్ కలెక్షన్ల విరవాలు ఏరియాలవారీగా ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 12.43 కోట్లు
సీడెడ్ – 6.20 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.85 కోట్లు
ఈస్ట్ – 3.24 కోట్లు
వెస్ట్ – 3.40 కోట్లు
గుంటూరు – 4.59 కోట్లు
కృష్ణా – 3.08 కోట్లు
నెల్లూరు – 2.94 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 40.73 కోట్లు(59.76 కోట్ల గ్రాస్)
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా – 2.79 కోట్లు
ఓవర్సీస్ – 4.77 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ – రూ.48.29 కోట్లు(75.90 కోట్ల గ్రాస్)