‘‘ధర్మ’’గా చిరు.. అందరూ ‘‘ఆచార్య’’ అదిరింది అంటున్నారు!..

10TV Telugu News

Acharya First Look Response: మెగాభిమానుల ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. ఇప్పుడు వారి ఆనందం రెట్టింపు అయ్యింది.. మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిలిం..‘ఆచార్య’.. చిరు పుట్టినరోజు సందర్భంగా ఈ సాయంత్రం ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.
గతంలో స్వయంగా చిరు చెప్పినట్టు ‘ఆచార్య’ అనే పేరునే ఖరారు చేశారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘ఆచార్య’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు భారీ స్పందన లభిస్తోంది. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.. ‘ఆచార్య’ ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ చూసిన సినీప్రముఖులు ట్విట్టర్ ద్వారా తమ అనుభవాలను పంచుకుంటున్నారు. చిరుని తెరమీద ఎప్పుడెప్పుడు చూస్తామా అనిపిస్తోంది.. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ మైండ్ బ్లోయింగ్.. అని కామెంట్స్ చేస్తున్నారు.

చక్కటి సందేశానికి కమర్షియల్ హంగులు జతచేసి చెప్పడంలో సిద్ధహస్తుడైన కొరటాల ‘ఆచార్య’ లోనూ తన మార్క్ మెసేజ్ చూపించనున్నారు. చిరు ఈ సినిమాలో ‘‘ధర్మ’’ అనే పాత్రలో కనిపించనున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత బ్యాలెన్స్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ‘ఆచార్య’ చిత్రాన్ని 2021 వేసవిలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చిరు సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కెమెరా: తిరు, ఎడిటింగ్: నవీన్ నూలి.

10TV Telugu News