Acharya : ‘ఆచార్య’ డే1 కలెక్షన్స్..

ఈ సినిమాని దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా 135 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆచార్య మొదటి రోజు వసూళ్లు..........

Acharya : ‘ఆచార్య’ డే1 కలెక్షన్స్..

Acharya

 

Acharya :  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఉదయం ఆట నుంచే పాజిటివ్ టాక్ ని అందుకొని సక్సెస్ గా దూసుకుపోతుంది ఈ సినిమా. తండ్రి కొడుకులని స్క్రీన్ మీద ఒకే సారి చూసి మెగా అభిమానులు, ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని దాదాపు 100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా 135 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

ఆచార్య మొదటి రోజు వసూళ్లు…

నైజాం – 7.99 కోట్లు

సీడెడ్ – 4.60 కోట్లు

ఉత్త‌రాంధ్ర – 3.61 కోట్లు

ఈస్ట్ – 2.53 కోట్లు

వెస్ట్ – 2.90 కోట్లు

గుంటూరు – 3.76 కోట్లు

కృష్ణా – 1.90 కోట్లు

నెల్లూరు – 2.30 కోట్లు

మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆచార్య’ తొలి రోజున రూ.29.59 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

Akhanda-Acharya : అఖండ.. ఆచార్య.. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్స్ ఇవే..

ఇక క‌ర్ణాట‌క‌, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియా, ఓవ‌ర్ సీస్ అంతా క‌లిపి మరో 4 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఆచార్య మొదటి రోజు దాదాపు రూ.33 కోట్ల పైనే షేర్ కలెక్షన్స్ సాధించింది. ఆచార్య పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి ఉంటే మరిన్ని కలెక్షన్స్ వచ్చేవని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. కేవలం తెలుగులోనే అన్ని చోట్ల ఆచార్యని విడుదల చేశారు. వీకెండ్ మరో రెండు రోజులు ఉండటం, వారం రోజులు వరకు మరే సినిమా లేకపోవడంతో ఆచార్యకి ఈజీగా బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.