Chiranjeevi : ‘ఆచార్య’ సినిమా అతని బయోపిక్? అతని పుస్తకం ఆధారంగానే తెరకెక్కుతుందా??

'ఆచార్య' సినిమా ఓ వ్యక్తి బయోపిక్ అని తెలుస్తుంది. 'సుబ్బారావు పాణిగ్రాహి జీవితం' అనే పుస్తకం ఆధారంగా కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఆ పుస్తకం............

Chiranjeevi : ‘ఆచార్య’ సినిమా అతని బయోపిక్? అతని పుస్తకం ఆధారంగానే తెరకెక్కుతుందా??

Acharya

Acharya :  చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో ‘ఆచార్య’ సినిమా రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చిరంజీవి – చరణ్ ఇద్దరూ కూడా నక్సలైట్లుగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పాటలు రిలీజ్ చేశారు. ఈ పాటలు బాగా వైరల్ అయ్యాయి. ‘ఆచార్య’ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుతం కరోనా దృష్ట్యా ఏర్పడ్డ పరిస్థితుల వల్ల ఈ సినిమా వాయిదాపడబోతుందని సమాచారం.

అయితే ‘ఆచార్య’ సినిమా ఓ వ్యక్తి బయోపిక్ అని తెలుస్తుంది. ‘సుబ్బారావు పాణిగ్రాహి జీవితం’ అనే పుస్తకం ఆధారంగా కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఆ పుస్తకం సుబ్బారావు పాణిగ్రాహి అనే వ్యక్తి గురించి రాసింది. సుబ్బారావు పాణిగ్రాహి ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు. 1970లలో ఆయన శ్రీకాకుళం వచ్చి అక్కడి శివాలయంలో పూజారిగా పనిచేశారు. ఆ సమయంలో దేవాలయ భూములను ఆక్రమించడానికి కొందరు భూస్వాములు ప్రయత్నించగా ఆయన అడ్డుపడ్డారు. ధైర్యసాహసాలతో ఆయన వాళ్లకి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే ఇద్దరు నక్సలైట్లు ఆయన పోరాటానికి అండగా నిలిచారు. తమ ప్రాణాలకి తెగించి ఆయన ఆశయ సాధనకి తమవంతు సహాయాన్ని అందించారు. ఆ తర్వాత ఆ ఇద్దరు నక్సలైట్లు కూడా ఒక వైపు పోరాటం చేస్తూనే మరో వైపు ఉపాద్యాయులుగా మారిపోయి అక్కడి ప్రజలను చైతన్యవంతులను చేశారట.

Nagarjuna : మీలాంటి వాళ్ళతో ఒక రోజంతా గడిపే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్‌యూ : బిగ్‌బాస్‌ లహరి

సుబ్బారావు పాణిగ్రాహి జీవితం పుస్తకాన్ని డాక్టర్ కె.ముత్యం రచించారు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని కథలోని కొన్ని అంశాలను మార్చి కొరటాల నక్సలైట్ల వైపు నుంచి కథను చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఆ పుస్తకంలో చెప్పిన ఇద్దరు నక్సలైట్ల పాత్రలనే చిరంజీవి – చరణ్ పోషిస్తున్నారు.