ప్రీ రిలీజ్ బిజినెస్.. ‘ఆచార్య’ అదరగొడుతున్నాడు!

ప్రీ రిలీజ్ బిజినెస్.. ‘ఆచార్య’ అదరగొడుతున్నాడు!

Acharya Movie: మెగాస్టార్ ఒక ఫ్రేమ్‌లో కనిపిస్తేనే పూనకాలు వచ్చి ఊగిపోతారు ఫ్యాన్స్. అలాంటిది తండ్రీ కొడుకులిద్దరూ సినిమాలో మేజర్ రోల్స్ ప్లే చేస్తే .. ఇక అభిమానుల ఆనందానికి అంతుంటుందా..? ఈ స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాకి హైప్స్, క్రేజ్ ఏ రేంజ్‌లో ఉండాలి..? అసలు ఈ సినిమా బిజినెస్ ఎంత జరగాలి..? అసలు ‘ఆచార్య’ బిజినెస్ ఎన్ని కోట్లు దాటిందో ఎక్స్‌పెక్ట్ చెయ్యగలరా..?

సౌత్ ఇండియాలో మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆచార్య’ కి ఇప్పటినుంచే రిలీజ్ హడావిడి స్టార్ట్ అయిపోయింది. అల్టిమేట్ యాక్షన్‌తో, మెగాస్టార్ పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో నిండిపోయిన టీజర్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ టీజర్ టాలీవుడ్‌తో పాటు సౌత్‌లో కూడా అభిమానుల అంచనాలను పెంచేసేలా కనిపిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ రేంజ్‌లో జరుగుతోంది.

Acharya

రూ. 300 కోట్ల బడ్జెట్‌తో భారీగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా ప్రస్తుతం మారేడుమిల్లి లొకేషన్స్‌లో షూటింగ్ జరపుకుంటోంది. చిరంజీవి లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనుండగా.. కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంతటి స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాకి బిజినెస్ కూడా అదే రేంజ్‌లోజరుగుతోంది. అది కూడా ఏకంగా 250 కోట్లను దాటిపోయింది.

ట్రేడ్ వర్గాల వారి సమాచారం ప్రకారం ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రా : రూ. 54 కోట్లు, నైజాం : రూ. 36 కోట్లు, సీడెడ్ : రూ. 27 కోట్లతో క్లోజ్ అయినట్టు టాలీవుడ్ సమాచారం. ఆంధ్రా, నైజాం, సీడెడ్ కలిపి వచ్చిన దాదాపు 120 కోట్లతో పాటు హిందీ డబ్బింగ్ రైట్స్ 28 కోట్లు, ఓవర్సీస్ బిజినెస్ 11 కోట్లకు జరిగిపోయింది.

Acharya

ఇక డిజిటల్ రైట్స్ 23 కోట్లు, శాటిలైట్ 15 కోట్లు, కర్ణాటక 11కోట్లు ,చెన్నై ఒకటిన్నర కోటితో పాటు ఒరిస్సా 75 లక్షల తో ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం దాదాపు రూ. 250 కోట్లకు పైగా జరిగిపోయిందని న్యూస్. రిలీజ్ కాకముందే ఇంత బజినెస్ చేసిన ‘ఆచార్య’.. రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డులు బ్రేక్ చేస్తాడో అని లెక్కలేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.

https://10tv.in/megastar-chiranjeevi-acharya-teaser/