Acharya: మరో పది రోజుల్లో ఆచార్య వచ్చేస్తున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా...

Acharya: మరో పది రోజుల్లో ఆచార్య వచ్చేస్తున్నాడా..?

Acharya To Come Early Than Expected On Amazon Prime Video

Acharya: మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తతో, ఆచార్య చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 29న ప్రపంవచ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ చేశారు. కానీ తొలిరోజే ఈ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఫ్లాప్ దిశగా వెళ్తోంది.

Acharya: ఆచార్య 4 రోజుల కలెక్షన్స్.. మండే టెస్ట్ ఫెయిల్!

కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా డిజాస్టర్ అని తేలిపోవడంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ అయిన మూడు వారాల తరువాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ ఆచార్య సినిమాను అనుకున్నదానికంటే ముందుగానే స్ట్రీమింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆచార్య చిత్ర నిర్మాతలకు అధనంగా మరో రూ.18 కోట్లు చెల్లించేందుకు వారు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Acharya: ఫోకస్ నెక్స్ట్.. ముగ్గురికి రూట్ క్లియర్ చేసిన ఆచార్య!

ఒకవేళ ఇదే నిజమైతే ఆచార్య చిత్రం మే 15 నాటి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతుంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఆచార్య మే 15 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాబోతుందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. కానీ దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.