Arjun : కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ డైరెక్టర్‌గా యాక్షన్ కింగ్.. హీరోగా విశ్వక్ సేన్..

యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. అయితే ఈ సారి తెలుగులో దర్శకత్వం వహించనున్నారు. దాంతో పాటు తన కూతురు ఐశ్వర్య ని తెలుగులో..................

Arjun : కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ డైరెక్టర్‌గా యాక్షన్ కింగ్.. హీరోగా విశ్వక్ సేన్..

Vishwaksen

Vishwak Sen :  ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పిస్తూ, గతంలో పలు సినిమాలకి దర్శకత్వం వహించిన యాక్షన్ కింగ్ అర్జున్ ఇప్పుడు మరోసారి మెగా ఫోన్ పట్టుకుంటున్నారు. అయితే ఈ సారి తెలుగులో దర్శకత్వం వహించనున్నారు. దాంతో పాటు తన కూతురు ఐశ్వర్య ని తెలుగులో హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారు అర్జున్. ఐశ్వర్య ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాలు చేసింది.

Allu Arjun : పుష్ప 2లో ఏం చూపించబోతున్నారు?

 

టాలీవుడ్ లో వరుస హిట్స్ కొడుతూ మాస్, క్లాస్ సినిమాలు తీస్తూ ఇటీవలే అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమాతో మంచి విజయం సాధించిన విశ్వక్ సేన్ హీరోగా అర్జున్ తన కొత్త సినిమాని అన్నౌన్స్ చేశారు. యాక్షన్ కింగ్ అర్జున్ రచయిత, దర్శకుడిగా విశ్వక్ సేన్ హీరోగా, ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా తన కొత్త సినిమాని నేడు ప్రకటించారు. ఈ సినిమాకి నిర్మాత కూడా అర్జున్ కావడం విశేషం.

ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సరికొత్తగా ఉంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలని ప్రకటించనున్నారు.