యాక్షన్ – రివ్యూ

యాక్షన్ హీరో విశాల్, తమన్నా జంటగా.. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యాక్షన్’ మూవీ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : November 15, 2019 / 11:52 AM IST
యాక్షన్ – రివ్యూ

యాక్షన్ హీరో విశాల్, తమన్నా జంటగా.. సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యాక్షన్’ మూవీ రివ్యూ..

యాక్షన్ హీరో విశాల్‌, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా తెరకెక్కిన పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యాక్షన్’.‌. సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అటు తమిళ్‌‌తో పాటు, ఇటు తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఎంత వరకు మెప్పించిందో చూద్దాం.. 

కథ విషయానికొస్తే : సుభాష్‌.. ఆర్మీ కల్నల్, అంతే కాదు సీఎం తనయుడు కూడా.. తన దగ్గరి బంధువు మీరా, సుభాష్‌ ప్రేమించుకుంటారు.. ఈ క్రమంలో సుభాష్‌ తండ్రి.. నిర్వహించిన పార్టీ మీటింగ్‌లో  జాతీయ నాయకుడు, పీఎం క్యాండిడెట్ చనిపోతాడు.. దాంతో సుభాష్‌ ఫ్యామిలీపై అనేక ఆరోపణలు వస్తాయి. సీఎం కాబోయే సుభాష్‌ అన్నయ్య ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ మధ్యలో ఆ బ్లాస్ట్ జరిగే ప్రాసెస్‌లో మీరా కూడా హత్యకి గురవుతుంది. తన వాళ్లకు చావుకి కారణమైన వాళ్ళను సుభాష్‌ ఎలా పట్టుకున్నాడు? వాళ్ళకి ఎలాంటి శిక్ష వేశాడు? అసలు  బ్లాస్ట్‌కి కారణం ఎవరు?సుభాష్‌ మళ్లీ ఎలా ప్రేమలో పడ్డాడు అనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే..

Read Also : తెనాలి రామకృష్ణ BA.BL – రివ్యూ

నటీనటుల విషయానికొస్తే : ఈ సినిమాలో విశాల్ యాక్టింగ్ పీక్స్ అని చెప్పొచ్చు.. ముఖ్యంగా చాలా కష్టమైన యాక్షన్ సీన్స్‌లో ఆయన తన మార్క్ యాక్షన్‌తో, నటనతో సినిమాకే హైలెట్‌గా నిలిచారు. తమన్నా తన స్క్రీన్‌ప్రెజెన్స్‌తో పాటుగా, నటనతోనూ ఆకట్టుకుంది. పోలీస్ క్యారెక్టర్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని సాంగ్స్‌లోనూ తమన్నా ఆకట్టుకుంలుంది. మరో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ కనిపించింది కొన్నిసీన్స్‌లోనే అయినా.. లవ్ సీన్స్‌ను బాగా పండించింది. ఇక సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన రాంకీ తన పాత్రకి పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రల్లో కనిపించిన మిగతా నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే :  డైరెక్టర్ సుందర్.. సినిమా కథను అద్భుతంగా రాసుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్‌లు.. ట్విస్ట్‌లతో ప్లాన్ చేసుకున్నాడు. కానీ సినిమా మధ్యలో సాగదీతలు.. లాజిక్ లేని సీన్స్ నిరాశ పరిచాయి. కథ, కథనాలు దెబ్బతిన్నాయి. డుడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని యాక్షన్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను అందంగా చిత్రీకరించారు. శ్రీకాంత్ ఎడిటింగ్ బాగుంది. సినిమాలో అవసరం లేని కొన్ని సీన్స్ ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ సమకూర్చిన పాటలు వినడానికి కంటే కూడా.. స్క్రీన్ మీద బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. నిర్మాణ విలువలు రిచ్‌గా
ఉన్నాయి.

ఓవరాల్‌గా చెప్పాలంటే : విశాల్ యాక్షన్ సీక్వెన్స్ లు, మ్యూజిక్, స్టార్ కాస్ట్ తో ఈ సినిమాను చక్కగా తెరకెక్కించినా.. కొన్ని చోట్ల తడబడ్డారు. దీంతో ఈ మూవీ టాలీవుడ్ లో యావరేజ్ టాక్ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వారం రోజులు మరో రిలీజ్ లేకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం.