‘ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్’ అంటున్న విశాల్

దీపావళి సందర్భంగా విశాల్, తమన్నా జంటగా, సుందర్. సి దర్శకత్వంలో రూపొందుతున్న ‘యాక్షన్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు..

  • Published By: sekhar ,Published On : October 28, 2019 / 06:03 AM IST
‘ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్’ అంటున్న విశాల్

దీపావళి సందర్భంగా విశాల్, తమన్నా జంటగా, సుందర్. సి దర్శకత్వంలో రూపొందుతున్న ‘యాక్షన్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు..

విశాల్, తమన్నా జంటగా, ప్రముఖ దర్శకుడు సుందర్. సి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అండ్ అడ్వెంచరస్ థ్రిల్లర్.. ‘యాక్షన్’.. విశాల్, సుందర్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఆర్. రవీంద్రన్ నిర్మిస్తున్నాడు. దీపావళి సందర్భంగా ‘యాక్షన్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ థ్రిల్‌కి గురిచేసే యాక్షన్ సన్నివేశాలతో, గూస్ బంప్స్ తెప్పించేలా చాలా ఆసక్తికరంగా ఉంది. టర్కీలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలిచాయి. ఈ యాక్షన్ సీన్స్‌ షూట్ చేస్తుండగా విశాల్ గాయపడ్డాడు.. తమన్నా గ్లామర్‌తో పాటు చేజింగ్ సీన్స్‌లోనూ కనిపించింది.

Read Also : రామ్ 18 ఫిక్స్ : కిషోర్‌తో ముచ్చటగా మూడోసారి

విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి. రాంకీ, యోగిబాబు, ఐశ్వర్య లక్ష్మీ, ఆకాంక్ష పూరి, కబీర్ దుహన్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ‘యాక్షన్’ విడుదల కానుంది. సంగీతం : హిప్ హాప్ తమిళ, కెమెరా : దుబే, ఎడిటింగ్ : శ్రీకాంత్.