Aditya Singh Rajput: బాలీవుడ్‌లో మ‌రో యువ‌ న‌టుడి అనుమానాస్ప‌ద మృతి

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ న‌టుడు, మోడ‌ల్‌, కాస్టింగ్ కో-ఆర్డినేటర్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్ ఇక‌లేరు.

Aditya Singh Rajput: బాలీవుడ్‌లో మ‌రో యువ‌ న‌టుడి అనుమానాస్ప‌ద మృతి

Aditya Singh Rajput

Aditya Singh Rajput: బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ న‌టుడు, మోడ‌ల్‌, కాస్టింగ్ కో-ఆర్డినేటర్ ఆదిత్య సింగ్ రాజ్‌పుత్(Aditya Singh Rajput) ఇక‌లేరు. ఆయ‌న వ‌య‌స్సు 32 సంవ్స‌రాలు. ముంబైలోని అంధేరీలో నివాసం ఉంటున్న ఆదిత్య త‌న సొంత ఇంట్లోని వాష్‌రూమ్‌లో అప‌స్మార‌క స్థితిలో క‌నిపించారు. వెంట‌నే అత‌డి స్నేహితుడు వాచ్‌మెన్ సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే ఆదిత్య మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు.

డ్ర‌గ్స్‌ ఓవ‌ర్ డోస్ కార‌ణంగానే ఆదిత్య చనిపోయి ఉంటాడ‌నే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆయ‌న మ‌ర‌ణం ఇండ‌స్ట్రీని దిగ్భ్రాంతిని గురి చేసింది. ఢిల్లీకి చెందిన ఆదిత్య సింగ్ మోడ‌ల్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ త‌రువాత న‌టుడిగా మారి.. ‘క్రాంతివీర్’, ‘మైనే గాంధీ కో నహీ మారా’ సినిమాల్లో న‌టించి త‌నకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా 300 పైగా యాడ్స్‌లో న‌టించాడు.

Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత..

‘స్ల్పిట్స్ విల్లా 9’ వంటి రియాలిటీ షోలోనూ పాల్గొన్నాడు. ‘ఆషికీ’, ‘కోడ్ రెడ్’, ‘ఆవాజ్ సీజన్ 9’ వంటి టీవీ షాల్లోనూ ప‌ని చేశాడు. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లోని చాలా మంది న‌టుల‌తో ఆయ‌న‌కు స‌త్సంబంధాలు ఉన్నాయి. చాలా మంది కొత్త‌వారిని ఆయ‌న ఇండ‌స్ట్రీకి ప‌రిచయం చేశారు.

ఆదిత్య మ‌ర‌ణంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆయ‌న మృత‌దేహాన్నిపోస్టుమార్టం నిమ‌త్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Sarath Babu : శరత్ బాబు సినీ ప్రయాణం.. IPS అవ్వాలి అనుకొని!