ఆడపిల్లలు మోసపోవద్దు.. నేరగాళ్లకు మీ పర్సనల్ వివరాలు ఇవ్వకండి..

  • Published By: sekhar ,Published On : July 18, 2020 / 04:11 PM IST
ఆడపిల్లలు మోసపోవద్దు.. నేరగాళ్లకు మీ పర్సనల్ వివరాలు ఇవ్వకండి..

సోషల్ మీడియా వినియోగం పెరిగేకొద్దీ నేరగాళ్లు కూడా పెరుగుతున్నారు. సినిమా పరిశ్రమ విషయానికొస్తే పలువురు సెలబ్రిటీల పేర్లు లేదా ఆయా సంస్థల పేర్లు చెప్పి సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, మా యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ స్పందించారు.

ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘మాకు అన్నపూర్ణ సంస్థ లేదా గీతాఆర్ట్స్.. మెత్రీ మూవీస్ తెలుసు.. లేదా పలానా డైరెక్టర్ తెలుసు, నేను వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాను అంటూ ఆడ‌పిల్ల‌ల‌కు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి వాళ్ళ దగ్గర పర్సనల్ ఇన్‌ఫర్మేషన్ తీసుకుని వాళ్ళని తప్పుదోవలోకి తీసుకెళ్ళుతున్నారు. ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు చెబుదామని మీ ముందుకు వచ్చాను. యాక్టింగ్ అనేది బ్యాడ్ ఐడియా కాదు.. యాక్టర్ అవుదామనేది తప్పుకాదు. ఎవరైనా యాక్టర్ అవ్వొచ్చు.

కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చేవారు ఎవరిని కలవాలి? ఏం చేయాలి? అనే సందిగ్ధతలో ఉంటారు. అలాంటి వారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎవ‌రైనా మీ వ్య‌క్తిగ‌త స‌మాచారం అడగడ‌మో, మిమ్మ‌ల్ని క‌ల‌వాలని ఫోన్ చేయడమో చేస్తే న‌మ్మ‌వ‌ద్దు. ఒక‌వేళ మీరు అలా వెళ్లినప్పుడు మీకు తోడుగా మీ ఫ్రెండ్‌నో, బ్ర‌ద‌ర్‌నో లేక తెలిసిన‌ వారినో తోడుగా తీసుకెళితే బావుంటుంది. మోస‌గాళ్ల వ‌ల‌లో ప‌డొద్దు’’ అని వీడియో రూపంలో విజ్ఞప్తి చేశారు.