Sarath kumar : నన్ను సీఎం చేస్తే 150 ఏళ్ళు బతికే సీక్రెట్ చెప్తా.. నటుడు శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్నారు నటుడు శరత్ కుమార్. తాజాగా తన పార్టీ ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి వార్షిక మహాసభలు మధురైలో జరిగాయి.

Sarath kumar : నన్ను సీఎం చేస్తే 150 ఏళ్ళు బతికే సీక్రెట్ చెప్తా.. నటుడు శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Actor and politician Sarath Kumar gives interesting political assurance

Sarath kumar : రాజకీయ నాయకులు ఎక్కడ లేని వాగ్దానాలు, వరాలు ఇస్తూ ఉంటారు ప్రజలకు. ఎలక్షన్స్ ఉన్నా లేకపోయినా పలువురు రాజకీయనాయకులు ప్రజలకు ఇచ్చే వాగ్దానాలకు మాత్రం ఢోకా ఉండదు. తమిళనాడులో ఇప్పట్లో ఎలక్షన్స్ లేకపోయినా సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ తాజాగా ప్రజలకు ఓ వింత హామీ ఇచ్చారు.

ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్నారు నటుడు శరత్ కుమార్. శరత్ కుమార్ ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి అనే రాజకీయ పార్టీని ఎప్పుడో స్థాపించారు. గతంలో శరత్ కుమార్ MLA గా, రాజ్యసభ ఎంపీ గా కూడా పనిచేశారు. తమిళనాడు ఎన్నికల్లో తన పార్టీ తరపున కూడా పోటీ చేస్తారు శరత్ కుమార్. తాజాగా తన పార్టీ ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి వార్షిక మహాసభలు మధురైలో జరిగాయి.

ఈ నేపథ్యంలో శరత్ కుమార్ మధురైలో ఓ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొనగా వారిని ఉద్దేశించి రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను. ఆదాయం కోసం మద్యపానాన్ని నమ్ముకోను అని అన్నారు. అలాగే.. నాకు ప్రస్తుతం 70 ఏళ్ళు వస్తున్నా ఇంకా 25 ఏళ్ళ యువకుడిలాగే జీవిస్తున్నాను. 150 ఏళ్ళు నేను జీవించగలను. అందుకు నేను ఒక ట్రిక్ నేర్చుకున్నాను. తమిళనాడు ప్రజలు నన్ను సీఎంని చేస్తే ప్రజలంతా 150 ఏళ్ళు ఎలా బతకాలో ట్రిక్ చెప్తాను అని అన్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి పార్టీ సభ్యులను గెలిపించి నన్ను సీఎంని చేయండి అని ప్రార్థించారు.

Mahesh Babu : ఇది నీకోసం నాన్న.. కృష్ణ బర్త్‌డే రోజు మహేష్ స్పెషల్ ట్వీట్..

దీంతో శరత్ కుమార్ చేసిన హామీ వైరల్ గా మారింది. సీఎంగా చేస్తే 150 ఏళ్ళు బతికే ట్రిక్ చెప్తాను అనడంతో ఇది వైరల్ గా మారడంతో పాటు పలువురు శరత్ కుమార్ ని విమర్శిస్తున్నారు. ఇలాంటి వెరైటీ వాగ్దానం ఇప్పటివరకు చూడలేదంటూ పలువురు సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు. మరి 2026 తమిళనాడు ఎలక్షన్స్ లో శరత్ కుమార్ ఎన్ని సీట్లు గెలుస్తాడో చూడాలి.