Actor Sapthagiri : కరోనా కష్టకాలంలో కమెడియన్ సప్తగిరి పెద్దమనసు, ఆ డైరెక్టర్ కుటుంబానికి రూ.లక్ష సాయం

కరోనా కష్టకాలంలో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కోవిడ్ బారిన పడి కష్టాల్లో ఉన్న డైరెక్టర్ కుటుంబానికి అండగా నిలిచాడు సప్తగరి. ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశాడు.

Actor Sapthagiri : కరోనా కష్టకాలంలో కమెడియన్ సప్తగిరి పెద్దమనసు, ఆ డైరెక్టర్ కుటుంబానికి రూ.లక్ష సాయం

Actor Comedian Sapthagiri Big Heart

Actor Sapthagiri : కరోనా కష్టకాలంలో టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి తన పెద్ద మనసు చాటుకున్నాడు. కోవిడ్ బారిన పడి ఆర్థిక కష్టాల్లో ఉన్న డైరెక్టర్ కుటుంబానికి అండగా నిలిచాడు. ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేశాడు.

సినీ ద‌ర్శ‌కుడు, ర‌చయిత నంద్యాల ర‌వి కరోనా బారిన పడ్డారు. ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు ఆయనను చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఇప్పటికే ఆయన కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకి ప్రైవేటు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. దీనికి తోడు ఆసుపత్రి బిల్లు 6 నుంచి 7 లక్షల దాకా అయినట్లు సమాచారం. అంత డబ్బు వారి దగ్గర లేదు. ఎలా కట్టాలో తెలియడం లేదు. ఈ విషయం తెలుసుకున్న కమెడియన్‌ సప్తగిరి వెంటనే స్పందించాడు. తన వంతు సాయంగా రవి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశాడు. అలా ఆర్థిక కష్టాల్లో ఉన్న డైరెక్టర్ కుటుంబానికి సప్తగిర ఆపన్నహస్తం అందించాడు.

కాగా, సప్తగిరి ఇలాంటి సాయం చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ కరోనా నేపథ్యంలో సినీ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ)కి కూడా సప్తగిరి తన వంతు విరాళంగా 2 లక్షల రూపాయలు అందించాడు. ఇప్పుడు డైరెక్టర్ కుటుంబానికి సైతం తన వంతు సాయాన్ని అందించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నాడు సప్తగిరి.పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.