Maa Elections : ప్రకాశ్ రాజ్‌కు సీవీఎల్ సారీ..! ఓటే వేయనని ప్రకటన!

ప్రముఖ నటుడు, బీజేపీ నేత సీవీఎల్ నర్సింహారావు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ('మా') సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Maa Elections : ప్రకాశ్ రాజ్‌కు సీవీఎల్ సారీ..! ఓటే వేయనని ప్రకటన!

Maa Elections (2)

Maa Elections : ప్రముఖ నటుడు, బీజేపీ నేత సీవీఎల్ నర్సింహారావు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (‘మా’) సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడిన సీవీఎల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలు చాలా బాధను కలిగిస్తున్నాయన్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేసిన తాను ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హుడిని కాదని ప్రకటించారు. ఇక ఇదే సమయంలో బీజేపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

Read More : Maa Elections : మా ఎన్నికల ప్రక్రియలో స్వల్ప మార్పు

దేశాన్ని, ధర్మాన్ని రక్షించేందుకు చాలామంది ఉన్నారని, దేవుళ్ళు వారిని వారు రక్షించుకోగలరని, తనతో పెద్ద పనేం లేదని తెలిపారు. ఇక ఈ సమయంలోనే ఇద్దరికి క్షమాపణలు చెప్పారు సీవీఎల్.. వారిలో ఒకరు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కాగా.. మరొకరు నటుడు ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ పై అనవసర వ్యాఖ్యలు చేశానని, క్షమించాలని కోరారు. ఇక ఇదిలా ఉంటే ‘మా’ ఎన్నిక పోలింగ్ అక్టోబర్ 10న జరగనుంది. 11న ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక మా ఎన్నికల అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఉన్న విషయం తెలిసిందే..

Read More : MAA Elections : మా ఎన్నికల్లో ఎందుకింత రగడ ?