MAA Association: ‘మా’కి అపవాదు రాకుండా నా బిడ్డ పనిచేస్తాడు -మోహన్ బాబు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

MAA Association: ‘మా’కి అపవాదు రాకుండా నా బిడ్డ పనిచేస్తాడు -మోహన్ బాబు

Manchu Vishnu

MAA Association: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో గెలిచిన మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సంధర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో నా బిడ్డ ‘మా’ ఎన్నికల్లో గెలిచాడని, ‘మా’ సభ్యులు నా బిడ్డను ఆశీర్వదించారని అన్నారు.

‘మా’ అధ్యక్షుడిగా అవ్వడం అంటే మాములు విషయం కాదని, బాధ్యతతో కూడుకున్న వ్యవహారం అన్నారు మోహన్ బాబు. ‘మా’ అసోసియేషన్‌కు అపవాదు రాకుండా నా బిడ్డ పనిచేస్తాడని అన్నారు మోహన్ బాబు. మా ఎన్నికలు తర్వాత శ్రీవారి దర్శనానికి వస్తామని ముక్కుకున్నట్లు చెప్పారు మంచు విష్ణు. ఈ క్రమంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నామని చెప్పారు మంచు విష్ణు.

నాగెలుపు కోసం ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో అద్భుతమైన పనులు చేయడానికి మాకు మరింత శక్తిని ప్రసాదించాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు మంచు విష్ణు.