సిక్స్ ప్యాక్‌లో నవదీప్.. సూపర్ అంటున్న నెటిజన్స్..

  • Published By: Mahesh ,Published On : April 24, 2020 / 05:12 PM IST
సిక్స్ ప్యాక్‌లో నవదీప్.. సూపర్ అంటున్న నెటిజన్స్..

టాలీవుడ్ యువ నటుడు తాజా ఇంటర్వూలో తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపాడు.
పైకి బ్యాడ్ బాయ్‌లా కనిపిస్తాను కానీ.. నేను అలాంటి వాడిని కాదు. అప్పుడెప్పుడో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ కారణంగా నా పై అలాంటి పేరు పడింది. కానీ బిగ్ బాస్(ఫస్ట్ సీజన్) తర్వాత నేనేంటో అందరికీ తెలిసింది. ఆ తర్వాత అందరూ నన్ను మంచివాడిగా గుర్తించడం మొదలెట్టారు. అందుకే ఈ సందర్భంగా బిగ్‌బాస్‌కు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు యంగ్ హీరో నవదీప్. 

సిక్స్ ప్యాక్ బాడీతో చూసేవాళ్లు సర్‌ప్రైజ్ అయేలా తయారైన నవదీప్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయిపోయాడు. అన్నట్టు త్వరలో విలన్‌గానూ దర్శనమివ్వబోతున్నాడు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘మోసగాళ్లు’ చిత్రంలో నవదీప్ విలన్‌గా నటిస్తున్నాడు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మంచి మంచి పాత్రలు వస్తున్నాయని, గత సంవత్సర కాలంగా తన కెరీర్ గాడిన పడిందని తెలిపాడు. తాజాగా వెబ్ సిరీస్‌లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు నవదీప్.