Drugs Case: నేడు ఈడీ విచారణకు నటుడు నవదీప్, ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌!

టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వయా శాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సినీ హీరో నవదీప్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌..

Drugs Case: నేడు ఈడీ విచారణకు నటుడు నవదీప్, ఎఫ్‌ క్లబ్‌ మేనేజర్‌!

Drugs Case

Drugs Case: టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు వయా శాండల్‌వుడ్ ఇండస్ట్రీల్లో డ్రగ్స్ వ్యవహారం సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భాగంగా సినీ హీరో నవదీప్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఈరోజు (సోమవారం) ప్రశ్నించనున్నారు. ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌కు సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సమన్లు జారీ చేయడంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Big Boss 5: హౌస్ నుండి బయటికెళ్ళాక శివాలెత్తిన సరయు..!

గత మంగళవారం నుండి సినీ సెలబ్రిటీల లావాదేవీలపై మళ్ళీ విచారణ మొదలు పెట్టిన ఈడీ అధికారులు టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది.

Deepika Padukone: చనిపోవాలనుకున్నా.. అంతలా నరకం అనుభవించా!

తొలుత కేసు అంతా డ్రగ్‌ సరఫరాదారుడు కెల్విన్‌ చుట్టూ తిరిగినా.. విచారణ క్రమంలో ఎఫ్‌-క్లబ్‌లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు. ఇప్పటికే ఈడీ అధికారులు పలువురి సెలబ్రిటీల నుండి వారివారి బ్యాంక్‌ ఖాతాల వివరాలు సేకరించగా.. ఈ కేసులో అప్రూవల్ గా మారిన కెల్విన్‌, అతడి స్నేహితుడు.. ఈవెంట్‌ మేనేజర్‌ జీషాన్‌అలీల బ్యాంక్‌ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బుల మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీశారు.

Big Boss 5: సరయు తొలివారమే ఎలిమినేషన్.. అభిమానులు కోరుకున్నదేనా?

ఇక నేటి విచారణలో నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ జనరల్‌ మేనేజర్‌ చెప్పే అంశాల ఆధారంగా ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. గతంలో 11 గంటల పాటు ఎక్సైజ్ శాఖ నవదీప్ ను విచారించగా.. నేడు ఈడీ అధికారులు లావాదేవాలపై విచారణ సాగనుంది. డ్రగ్స్ కేసుకు.. ఆర్ధిక లావాదేవీలకు సంబంధం ద్వారా ఈ కేసును కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్న అధికారులు నేటి విచారణలో ఏం తేల్చనున్నారన్నది చూడాల్సి ఉంది.