హోటల్ బిల్లు కట్టని ప్రముఖ నటి: రూ.3.5లక్షలు పెండింగ్

హోటల్ బిల్లు కట్టని ప్రముఖ నటి: రూ.3.5లక్షలు పెండింగ్

హోటల్ బిల్లు కట్టని ప్రముఖ నటి: రూ.3.5లక్షలు పెండింగ్

కన్నడ ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు దండు పాళ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన పూజా గాంధీపై బెంగళూరులో పోలీసు కేసు నమోదైంది. బెంగళూరులోని ఓ లగ్జరీ హోటల్‌‌లో బసచేసిన ఆమె బిల్లు కట్టకుండా పరారవడంతో ఆమెపై హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు విషయం ఏమిటంటే.. నటి పూజా గాంధీ కొద్ది రోజుల క్రితం బెంగళూరులోని ది లలిత్ అశోక్ అనే లగ్జరీ హోటల్‌లో 2016లో గదిని అద్దెకు తీసుకుంది. కొన్నిరోజులపాటు తన ఫ్రెండ్, బీజేపీ లీడర్‌ అనీల్ పీ మెన్‌సింకాయ్‌తో అక్కడే ఉన్న ఆమె.. రూ. 6,22,344 బిల్ చేసింది.
Read Also :భారీ తిమింగలం మృతి..కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు

అయితే అందులో రూ. 22,83,129 మత్రమే చెల్లించిందని, మిగిలిన 3.5లక్షల బిల్లును చెల్లించేందుకు నిరాకరిస్తుందంటూ ఆ హోటల్ యాజమాన్యం పూజా గాంపైధీ కేసు నమోదు చేసింది. దీంతో తమ ఎదుట హాజరుకావాల్సిందిగా పూజాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇది అంతా అవాస్తవమని, మొత్తం డబ్బు చెల్లించానని తనపై తప్పుడు కేసులను హోటల్ యాజమాన్యం పెడుతుందని ఆమె చెబుతుంది. 
Read Also :కాంగ్రెస్ కు మరో షాక్ : కారెక్కుతున్న కొల్హాపూర్ ఎమ్మెల్యే

×