MAA Association : ‘మా’ సభ్యుడిని బెదిరించిన పృథ్వీ రాజ్

మూవీ ఆర్టిస్టు ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ లు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

MAA Association : ‘మా’ సభ్యుడిని బెదిరించిన పృథ్వీ రాజ్

Maa

Actor Prithviraj : మూవీ ఆర్టిస్టు ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి. బరిలో ఉన్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్ లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్నికలకు ఇంకా మూడు రోజులే ఉండడంతో ఎన్నికల పర్వంలో బెదిరింపులు సైతం మొదలయ్యాయి. మంచు విష్ణు ప్యానెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తున్న నటుడు పృథ్వీ రాజ్ బెదిరింపులకు దిగడం చర్చనీయాంశమైంది. ఒక మా సభ్యుడిని ఫోన్ లో బెదిరించడం..దీనికి సంబంధించిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రకాష్ రాజ్ కు ఎందుక సపోర్టు చేస్తున్నారంటూ..అవతలి వ్యక్తిపై మండిపడ్డారు.

Read More : OTT Release: ఈ వారం OTTల్లో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

తాను చదువుకుంది..వైజాగ్ అని పృథ్వీ ఫోన్ లో తెలిపారు. ప్రకాష్ రాజ్ కు సన్మానం చేయడం తనను బాధించిందని, తాము ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉంటున్నామన్నారు. అందరితో మంచి రిలేషన్స్ ఉన్నాయని, ఎక్కడి నుంచి వచ్చి..ఇక్కడ పోటీ చేస్తున్నారని, కృష్ణ గాడు ఎవడూ అంటూ మాట్లాడారని ఫోన్ లో తెలిపారు. దీనికి సభ్యుడు అభ్యంతరం తెలిపారు. తాము అలాంటి భాష వాడలేదన్నారు. తాను నామినేషన్ వేయడం కోసం..అసోసియేషన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయడం జరిగిందన్నారు. కరోనా కాలంలో ఇంటింటికి తిరిగి సర్వ్ చేశామని..తెలుగు వాడు ప్రెసిడెంట్ ఎందుకు కాకుడదూ అంటూ పృథ్వీ ప్రశ్నించారు.

Read More : ‘Maa’ Elections : హేమ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కరాటే కళ్యాణి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది మాటల తూటాలు పేలుతున్నాయి. అధ్యక్ష బరిలో ఉన్న వారి మధ్యే కాదు ప్యానెల్ సభ్యులు డైలాగ్స్‌తో హీట్ పెంచుతున్నారు. నటి హేమ, కరాటే కల్యాణి మధ్య ఫిర్యాదుల వార్ నడుస్తోంది. నటి హేమపై కల్యాణి విరుచుకుపడ్డారు. హేమ తెగ రెచ్చిపోతుందన్నారు. సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని నటి హేమ లేఖలో తెలిపారు. దీంతో రెండు ప్యానెళ్ల వార్ రోజురోజుకి ముదురుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు అక్టోబరు 10వ తేదీన జరగబోతున్నాయి. మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి బాబుమోహన్, శ్రీకాంత్ పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్‌లో రెండు వైస్ ప్రెసిడెంట్ పదవులకు బెనర్జి, హేమ, మాదాల రవి, పృథ్వీరాజ్ పోటీ పడుతున్నారు.

Read More : BiggBoss : బిగ్ బాస్ రాజ్యం.. రాజులు.. రాజ్యాలు.. కొట్టుకున్న కంటెస్టెంట్లు

“మా” అసోసియేషన్ లో జనరల్ సెక్రటరీ పదవికి జీవిత రాజశేఖర్, రఘుబాబు పోటీ పడుతున్నారు. మా అసోసియేషన్‌లో కోశాధికారి పదవికి శివబాలాజీ, నాగినీడు పోటీ పడుతున్నారు. రెండు జాయింట్ సెక్రటరీ పదవులకు ఉత్తేజ్, అనితా చౌదరి, బచ్చల శ్రీనివాస్, గౌతమ్ రాజ్, కళ్యాణి పోటీ పడుతున్నారు. ప్రధాన కార్యదర్శి రేసు నుంచి తప్పుకుంటున్నట్టు బండ్ల గణేష్ ప్రకటించగా.. తన ప్యానెల్ మేనిఫెస్టోను కూడా విడుదల చేసి రేసులో ఉన్నానంటూ సంకేతాలు పంపిన నటుడు సీవీఎల్ నరసింహారావు మధ్యాహ్నానికి మనసు మార్చుకుని, ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.