Ram Pothineni : ‘ఉస్తాద్’ రామ్ షర్ట్ కాస్ట్ ఎంతో తెలుసా?
రామ్ పోతినేని రీసెంట్‌గా సరికొత్త లుక్‌లో.. సూపర్ స్టైలిష్ అండ్ క్యూట్‌గా కనిపించాడు..

Ram Pothineni
Ram Pothineni: ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ హిట్ తర్వాత ఎనర్జిటిక్ స్టార్, ఉస్తాద్ రామ్ తమిళ స్టార్ డైరెక్టర్ ఎన్.లింగుస్వామితో ‘ది వారియర్’ అనే సినిమా చేస్తున్నాడు. రామ్ నటిస్తున్న 19వ సినిమా ఇది. కెరీర్‌లో ఫస్ట్ టైం రామ్ పోలీస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇందుకోసం సరికొత్తగా మేకోవర్ అయ్యాడు.
Ram Charan : రామ్ చరణ్, బాలయ్య బాబు గణతంత్ర వేడుకలు
రామ్ రీసెంట్ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సరికొత్త లుక్‌లో సూపర్ స్టైలిష్‌గా, క్యూట్‌గా కనిపించాడు. రామ్ వేసుకున్న షర్ట్ గురించి గూగుల్‌లో సెర్చ్ చేశారు ఫ్యాన్స్.
రామ్, గ్రీన్ కలర్ గియో ట్రిబల్ ప్రింట్‌తో ఉన్న బెర్ష్కా షార్ట్ స్లీవ్డ్ షర్టు (Bershka Short Sleeved Shirt)లో కనిపించగానే కెమెరాలు క్లిక్కుమనిపించారు. ఈ షర్ట్ కాస్ట్ 2,692 రూపాయలు. (36 Us Dollars).
‘ది వారియర్’ విషయానికొస్తే.. కృతి శెట్టి, అక్షర గౌడ కథానాయికలు కాగా, ఆది పినిశెట్టి ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై ‘సీటీమార్’ ఫేం శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు.
THE WARRIOR : ‘వారియర్’ గా ఉస్తాద్ రామ్..