ప్రముఖ నటుడు రంజిత్ చౌదరి ఇకలేరు

  • Published By: sekhar ,Published On : April 16, 2020 / 09:09 AM IST
ప్రముఖ నటుడు రంజిత్ చౌదరి ఇకలేరు

బాలీవుడ్ సీనియర్ నటుడు రంజిత్ చౌదరి బుధవారం కన్నుమూశారు. ఆయన వయసు 65 సంవత్సరాలు. నాటకం, టీవీ, సినీ రంగాలలో నటించిన రంజిత్ అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ‘Khatta Meetha’తో హిందీ చిత్రపరిశ్రమలో ప్రస్థానం ప్రారంభించారాయన.

‘Bandit Queen’, ‘Baton Baton Mein’, ‘Khubsoorat’, ‘Sam & Me’, ‘Mississippi Masala’, వంటి ఎన్నో సినిమాలలో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘The Night We Never Met’, ‘Lonely in America’ వంటి పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు. Ranjit Chowdhry మరణానికి బాలీవుడ్‌, హాలీవుడ్‌ నటులు, సాంకేతిక నిపుణులు సోషల్‌ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.  

Ranjit Chowdary

అమెరికా టీవీ సిరీస్‌ ‘Prison Break’లో డాక్టర్‌ మార్విన్‌ గుడాట్‌ క్యారెక్టర్లో కనిపించింది రెండు ఎపిసోడ్స్‌లోనే అయినా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటించారు. దీపా మెహతా ‘Sam & Me’ చిత్రంలో నటించడంతో పాటు స్క్రీన్‌‌ప్లే కూడా సమకూర్చారు. బాలీవుడ్ హీరో రాహుల్‌ ఖన్నా, దర్శకురాలు దీపా మెహతా, రాహుల్ ఢోలాకియా, పూర్ణ జగన్నాథన్‌ తదితరులు Twitterలో నివాళులు అర్పించారు. కాగా గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రంజిత్ చౌదరి ఇటీవల సర్జరీ కోసం హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు తెలుస్తోంది. 

Ranjit Chowdary

Read Also : మంచు వారి వేడి వేడి కొబ్బరిబోండాం చికెన్ రైస్ రెడీ..