Actor Siddhartha : “ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్ళు”…నెటిజన్‌పై సిధ్ధార్థ్ ఫైర్

Actor Siddhartha : “ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్ళు”…నెటిజన్‌పై సిధ్ధార్థ్ ఫైర్

Siddartha

Actor Siddhartha : శంకర్ “బాయ్స్” సినిమాతో హీరోగా కెరీర్ మొదలు పెట్టి నువ్వోస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు వంటి చిత్రాల్లో తెలుగు ఇండ్రస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సిధ్ధార్థ్ . సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.  బొమ్మరిల్లు సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు సిధ్ధార్థ్, ఆతర్వాత అతను  నటించిన సినిమాలు పెద్దగా విజయాలు సాధించలేదు. దీంతో తెలుగు సినిమాలకు దూరమై, తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు సిధ్ధార్థ్ .

ఆర్ఎక్స్ 100 ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మహసముద్రం అనే సినిమాలో శర్వానంద్ తో కలిసి  సిధ్దార్థ్ నటిస్తున్నాడు. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్ప‌టికే సిద్ధార్థ్ లుక్ విడుద‌లై అభిమానులను ఆకట్టుకుంది.

కాగా హీరో సిధ్ధార్థ ఏజ్ వియషయమై ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ సిధ్ధార్థ్ కు ట్యాగ్ చేశాడు. ‘40 ఏళ్లు పైబడిన సిద్ధార్థ్  తో 20 ఏళ్ల హీరోయిన్లు నటిస్తే మాత్రం వల్లమాలిన ప్రేమలు, ముద్దుల ఎమోజీలు.. ఇదెక్కడి లాజిక్కో.. దిక్కుమాలిన లాజిక్ అంటూ’ ట్వీట్ చేసి అతనికే ట్యాగ్ చేశాడు.

ఈ ట్ట్‌ట్పై  సిద్ధార్థ్‌ కూడా ఘాటుగానే   జవాబిచ్చాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్‌లో ఫస్ట్ నేనే గుర్తొచ్చాను రా? ట్యాగ్ కూడా చేశావ్? సూపర్‌ రా దరిద్రమ్. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లయ్ ఇచ్చి ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సిధ్ధార్థ్ చేసిన ఈ ట్వీట్ వైరల్‌గా మారి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.