Actor Simbu: బన్నీని ఫాలో అవుతున్న తమిళ హీరో.. శభాష్ అంటోన్న ఫ్యాన్స్!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓ పాన్ మసాలా కంపెనీ, తమ ప్రోడక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే ఏకంగా రూ.10 కోట్లు ఇస్తామని బన్నీకి ఆఫర్ ఇవ్వగా, ఆయన నో చెప్పాడు. తన అభిమానులు తనను చూసి పోగాకు అలవాటు కావడం తనకు ఇష్టం లేదని బన్నీ ఈ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు.

Actor Simbu: బన్నీని ఫాలో అవుతున్న తమిళ హీరో.. శభాష్ అంటోన్న ఫ్యాన్స్!

Actor Simbu: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఓ పాన్ మసాలా కంపెనీ, తమ ప్రోడక్టులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటే ఏకంగా రూ.10 కోట్లు ఇస్తామని బన్నీకి ఆఫర్ ఇవ్వగా, ఆయన నో చెప్పాడు. తన అభిమానులు తనను చూసి పోగాకు అలవాటు కావడం తనకు ఇష్టం లేదని బన్నీ ఈ భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాడు. ఇక తాజాగా ఓ లిక్కర్ కంపెనీ కూడా తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు బన్నీకి భారీ మొత్తాన్ని ఆఫర్ చేయగా, దానికి కూడా బన్నీ నో చెప్పేశాడు. ఇలా ఓ స్టార్ హీరో తన అభిమానుల కోసం హానికరమైన ప్రోడక్టులను ప్రమోట్ చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Allu Arjun : ఐకాన్ స్టార్ మరో మాస్ లుక్.. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం..

ఇప్పుడు బన్నీని ఫాలో అవుతున్నాడో ఓ తమిళ స్టార్ యాక్టర్. తమిళ హీరో శింబు కూడా తమిళనాట మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్న హీరో. అయితే శింబును కూడా తాజాగా ఓ లిక్కర్ కంపెనీ తమ ప్రోడక్టులను ప్రమోట్ చేయాల్సిందిగా కోరిందట. అయితే తాను ఇలాంటి ప్రోడక్టులను ప్రమోట్ చేయనని తేల్చి చెప్పేయడంతో తమిళ తంబీలు శింబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇలా హీరోలు కేవలం డబ్బుల గురించే కాకుండా తమ అభిమానుల ఆరోగ్యం గురించి ఆలోచించడం నిజంగా గ్రేట్ అంటున్నారు శింబు అభిమానులు.

Allu Arjun : బ్రాండ్ ప్రమోషన్స్ లో పోటీ పడుతున్న స్టార్స్..

ఇటు టాలీవుడ్‌లో బన్నీ చేస్తున్న పనిని మిగతా హీరోలు కూడా ఫాలో అవ్వాలని పలువురు అభిమానులు కోరుతున్నారు. కేవలం డబ్బు కోసమే కాకుండా అభిమానుల, ప్రేక్షకుల ఆరోగ్యం గురించి కూడా హీరోలు ఆలోచించాలని.. అప్పుడే అందరూ బాగుంటారని వారు అంటున్నారు. ఏదేమైనా ఇలా హీరోలు తమ ఫ్యాన్స్ కోసం కోట్లను వదులుకోవడం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీలుగా మారింది.