Punjab : మానవత్వం చూపించిన సోనూ సూద్

కారులో ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న నటుడు సోనూ సూద్ కు కంటపడింది. వెంటనే కారును ఆపి.. అక్కడకు చేరుకున్నాడు. కారు సెంట్రల్ లాక్ ఉండడంతో సోనూ సూద్ కష్టపడాల్

Punjab : మానవత్వం చూపించిన సోనూ సూద్

Sonusood

Actor Sonu Sood : మరోసారి మానవత్వం చూపించారు నటుడు సోనూ సూద్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడిని రక్షించి దగ్గరిలోని ఆసుపత్రికి తరలించారు. సమయానికి వైద్యం అందించడంతో ఆ యువకుడు కోలుకున్నాడు. ప్రమాదానికి గురైన కారు సెంట్రల్ లాక్ ఉండడం.. ఎలాగైనా అతడిని రక్షించాలని సోనూ సూద్ చేసిన ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు తెలియచేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పంజాబ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ రాష్ట్రంలోని మెగా ప్రాంతంలో ఫిబ్రవరి 07వ తేదీన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Read More : Bolero 2022 Model: రెండు ఎయిర్ బ్యాగులతో “బొలెరో 2022” మార్కెట్లోకి విడుదల

కారులో ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళుతున్న నటుడు సోనూ సూద్ కు కంటపడింది. వెంటనే కారును ఆపి.. అక్కడకు చేరుకున్నాడు. కారు సెంట్రల్ లాక్ ఉండడంతో సోనూ సూద్ కష్టపడాల్సి వచ్చింది. అక్కడనే ఉన్న ఇతరులు సహాయం చేశారు. ఎలాగో కారు డోర్ ను ఓపెన్ చేసి.. అందులో ఉన్న యువకుడిని దగ్గరిలోని హాస్పిటల్ కు తరలించారు. స్వయంగా హాస్పిటల్ కు వెళ్లి అక్కడి వైద్యులతో మాట్లాడారు. టైంకు తీసుకరావడంతో అతడికి వైద్యులు చికిత్స చేసి రక్షించారు.

సోనూ సూద్..ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన ఈ నటుడు..రియల్ జీవితంలో మాత్రం హీరో అయ్యాడు. కరోనా సమయంలో అతను చేసిన సహాయం అంతా ఇంతా కాదు. ఆపదలో ఉన్న వారిని నేనున్నాను..అంటూ అక్కడ ప్రత్యక్షం కావడమో..లేక..ఇతర మార్గాల ద్వారా వారికి సహాయం అందించాడు. విదేశాల్లో చిక్కుకున్న వారిని, తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న వారిని రక్షించారు. దీంతో అతనికి ప్రజలు నీరాజనాలు పట్టారు. అతడిని చూడటానికి కిలోమీటర్లు నడవడం, సైకిల్ పై రావడం..వంటివి చేశారు. ట్విట్టర్ వేదికగా తమకు సహాయం చేయాలని అన్నదే తడవుగా..వెంటనే వారికి తోచిన విధంగా సహాయం చేశారు సోనూ. ఆయనకు కొందరు గుడులు సైతం కట్టి పూజిస్తున్నారు.

Read More : Modi Vs TRS: ప్రధాని మోడీ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వనున్న టీఆర్ఎస్ ఎంపీ

అయితే.. అనూహ్యంగా ఆయన ఆఫీస్ లలో… ఇన్ కంటాక్స్ అధికారుల సోదాల వ్యవహారం ఇటీవల దేశమంతటా చర్చనీయాంశమైంది. సోనూసూద్ తన ఆదాయానికి సంబంధించిన భారీస్థాయిలో పన్నులు ఎగవేశారని ఐటీ శాఖ నుంచి లీకులు కూడా వచ్చాయి. దీంతో… సోనూసూద్ ఆదాయపు పన్నుల వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ అయింది. భారత దేశ ప్రజలకు శక్తి వంచన లేకుండా.. నిండు మనసుతో సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఞ చేసుకున్నా. అవసరంలో ఉన్న వారికి… ప్రాణాలు కాపాడటానికి నా ఫౌండేషన్ కు వచ్చే ప్రతి రూపాయి ఎదురుచూస్తుంది అంటూ సోనూ స్పందించారు. మానవత్వం చాటుతూ సేవ చేసేందుకు తాను మళ్లీ సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తన సేవా ప్రయాణం కొనసాగుతుందని.. జైహింద్ అంటూ తన లెటర్‌ను ముగించారు సోనూ సూద్.