Writer Padmabhushan : హీరోగా ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్.. ఎక్కడి నుంచి ఎక్కడిదాకా వచ్చేశావురా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సుహాస్..

విజయవాడలో రాజ్ యువరాజ్ థియేటర్ లో ఎన్నో సినిమాలు చూసిన సుహాస్ తన రైటర్ పద్మభూషణ్ సినిమా అదే థియేటర్లో రిలీజ్ అవుతుండటంతో ఆ థియేటర్ బయట నించొని ఓ వీడియో తీసుకోని ఆ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ....................

Writer Padmabhushan : హీరోగా ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్.. ఎక్కడి నుంచి ఎక్కడిదాకా వచ్చేశావురా అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సుహాస్..

Actor Suhas emotional post on Writer Padmabhushan Theatrical Release

Writer Padmabhushan :  షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టి, యూట్యూబ్ లో వీడియోలు తీసుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు సుహాస్. తన ట్యాలెంట్ తో షార్ట్ ఫిలిమ్స్ నుంచే అందర్నీ మెప్పించాడు. లాక్ డౌన్ సమయంలో కలర్ ఫోటో సినిమాతో హీరోగా వచ్చి ఓటీటీలో భారీ విజయం సాధించి స్టార్ అయిపోయాడు. అంతకుముందు పడిపడి లేచే మనసు, మజిలీ, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. లాంటి పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించాడు.

కలర్ ఫోటో సినిమా భారీ హిట్ అవ్వడం, నేషనల్ అవార్డు రావడంతో సుహాస్ కి అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో సుహాస్ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా చేసిన రైటర్ పద్మభూషణ్ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సుహాస్ హీరోగా చేసిన కలర్ ఫోటో సినిమా కరోనా లాక్ డౌన్ వల్ల ఓటీటీలో విడుదల కావాల్సి వచ్చింది. రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. దీంతో సుహాస్ హీరోగా చేసిన సినిమా మొదటి సారి థియేటర్స్ లో రిలీజ్ అవుతుండటంతో సుహాస్ చాలా ఎమోషనల్ అవుతూ ఓ పోస్ట్ పెట్టాడు.

విజయవాడలో రాజ్ యువరాజ్ థియేటర్ లో ఎన్నో సినిమాలు చూసిన సుహాస్ తన రైటర్ పద్మభూషణ్ సినిమా అదే థియేటర్లో రిలీజ్ అవుతుండటంతో ఆ థియేటర్ బయట నించొని ఓ వీడియో తీసుకోని ఆ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అబ్బో… ఎక్కడి నువ్వు ఎక్కడికి వచ్చేశావురా సుహాసూ.. సినిమాలు తప్ప పుస్తకాలను పట్టించుకోకపోవడం, కాలేజీ ఎగ్గొట్టి మార్నింగ్‌, మ్యాట్నీ షోలకు అటెండ్ కావడం.. చిరిగిపోయే టికెట్‌ కోసం లైన్‌లో చొక్కాలు చింపుకోవడం.. ఇవన్నీ తెలిసి నాన్న బెల్ట్ తెగిపోయేలా కొట్టడం.. సినిమా ఛాన్స్‌ కోసం చెప్పులు అరిగేలా తిరగడం.. వచ్చిన అరకొర వేషాలతో కడుపునిండక, భవిష్యత్తు కనపడక, కళ్లు నీటితో నిండిపోవడం, యూట్యూబ్ నుంచి దూరంగా, హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునేలోపే వెండితెర వెయిటింగ్‌లో పడి ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌ కావడం.. దానికి జాతీయ అవార్డు రావడం.. ఫైనల్‌గా విజయవాడకు దూరంగా, సినిమాకు దగ్గరగా.. సుమారు పదేళ్ల ప్రయాణం తర్వాత.. ఏదో అద్భుతంలా ఈ సినిమా పురుగు నా బుర్రలో ఎక్కడైతే మొదలైందో అక్కడే నా మొదటి థియేటర్‌ రిలీజ్‌, మొదటి ప్రీమియర్‌ పడటం.. అబ్బో ఈ ఫీలింగ్‌ ఏంటో మామూలుగా లేదుగా రా సుహాసూ.. మీరంతా సినిమా చూడండి అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.

Anurag Kashyap : నా స్వార్థం కోసం సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయను..

సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఫేస్ చేస్తూ ఇక్కడిదాకా ఎదిగిన సుహాస్ కి అంతా అభినందనలు తెలుపుతున్నారు. రైటర్ పద్మభూషణ్ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు అంతా.