Suman : నేను రాజకీయాల్లోకి రాను..

సుమన్ మాట్లాడుతూ.. '' ఆంధ్రప్రదేశ్‌లో చిత్రపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని......

Suman : నేను రాజకీయాల్లోకి రాను..

Suman

Suman : ఒకప్పటి హీరో, సీనియర్ నటుడు సుమన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆల్‌ ఇండియా సుమన్‌ ఫ్యాన్స్‌ ప్రెసిడెంట్‌ ధూళిపాళ్ళ దేవేంద్రరావు ఇంటి వద్ద జరిగిన ఒక కార్యక్రమానికి ఇటీవల సుమన్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు సుమన్.

Virataparvam : విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

సుమన్ మాట్లాడుతూ.. ” ఆంధ్రప్రదేశ్‌లో చిత్రపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సినీ ప్రముఖులు కలిసిన సందర్భంలో చిత్ర పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలను అందచేస్తామని తెలిపారు. ప్రస్తుతం నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. రాజకీయాల్లోకి నేను రాను. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాల గురించి ఆలోచించేవారికే ఓట్లు వేస్తారు” అని తెలిపారు.