నిద్రాహారాలు మానేసి సుశాంత్ ఫోటోనే చూస్తూన్న పెంపుడు కుక్క

  • Edited By: nagamani , June 20, 2020 / 07:45 AM IST
నిద్రాహారాలు మానేసి సుశాంత్ ఫోటోనే చూస్తూన్న పెంపుడు కుక్క

బాలీవుడ్ యువ న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మ‌ర‌ణం కుటుంబ స‌భ్యులనే కాదు..సుశాంత్ ప్రాణప్రదంగా పెంచుకున్న పెంపుడు కుక్క ‘ఫుడ్జ్’ కు కూడా తీరని మనోవేదనను మిగిల్చింది.  సుశాంత్ అంటే ఫుడ్జ్ కు ప్రాణం. అంతప్రేమగా చూసుకున్నాడు సుశాంత్ దాన్ని.

ఇంటి దగ్గర ఉంటే సుశాంత పక్కనే పుడ్జ్ ఉండాల్సిందే. దానితో కలిసి ఆడుకునేవాడు. దానికి బోలెడన్ని కబుర్లు చెప్పేవాడు. ఆటల్లోనే ఇద్దరికీ మంచి పోటీ ఉండేది. సుశాంత్ అంటే పుడ్జ్ కు ప్రాణం కన్నా ఎక్కువ. 

అటువంటిది తన ప్రాణం..తన నేస్తం అయిన సుశాంత్ మరణంతో పుడ్జ్ బెంగలోపడిపోయింది. ఎందుకు తన నేస్తం కనిపించట్లేదో తెలియని ఆ మూగజీవి బెంగతో ఆహారం తినటం మానేసింది. పాలు తాగటం మానేసింది. సుశాంత్ కోసం నిద్ర‌హారాలు లేకుండా ఎదురు చూస్తుంద‌ని సుశాంత్ ఇంటి పనిమనుషులు అంటున్నారు.చిన్న చప్పుడు వినిపించినా..డోర్ శబ్దం వినిపించినా..తన నేస్తం వచ్చాడేమోనని పరుగు పరుగున వెళ్లి చూస్తోందనీ..చెబుతున్నారు.

సార్ ఉన్నప్పుడు దాంతో ఆడుకుంటూంటే..ఇల్లంతా సందడిగా ఉండేదనీ..పుడ్జ్ అల్లరి అంతా ఇంతా కాదు..ఇల్లంతా కలియతిరిగేస్తూ ఇంట్లో వందమంది ఉన్నంత హడావిడి చేసేదనీ వాపోయారు. అటువంటిది సుశాంత్ సార్ చనిపోయాక..ఫోన్ స్క్రీన్‌పై సుశాంత్ బొమ్మను పెట్టుకుని అలాగే చూస్తుండిపోతుందని.. ఆఫ్ అయిపోతే కాలితో టచ్ చేసి ఓపెన్ చేసుకుంటుందని తెలిపారు. ఫుడ్జ్ బెంగ తగ్గించేందుకు ఆహారం తినేలా చేయటానికి ప‌శువుల వైద్యుడికి చూపించినా కూడా ఏ మార్పు లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. 

కాగా..ఎంతో మంచి మనస్సున్న సుశాంత్ సిండ్ ఆత్మహత్య ఆయన అభిమానుల‌ను మనస్సులను తీవ్రంగా గాయపరిచింది. ఇప్పటికీ సుశాంత్ లేడని మాటను తట్టుకోలేకపోతున్నారు. ఈ మానసిక వేదనతోనే ఆయ‌న మ‌ర‌ణాన్నిత‌ట్టుకోలేక కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకున్న విషయ తెలిసిందే.  

Read: నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్..!