Pareshan Movie Teaser : మందు సంఘాల ధర్నా.. పరేషాన్ టీజర్ అదుర్స్!

టాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా పని చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటూ వెళుతున్న హీరో 'తిరువీర్'. రీసెంట్ గా మెయిన్ లీడ్ లో 'మాసూద' సినిమాలో నటించాడు. ఇక ఈ మూవీ తరువాత ఈ హీరో నుంచి వస్తున్న తాజా చిత్రం 'పరేషాన్'.

Pareshan Movie Teaser : మందు సంఘాల ధర్నా.. పరేషాన్ టీజర్ అదుర్స్!

Pareshan Movie Teaser

Pareshan Movie Teaser : టాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా పని చేస్తూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంటూ వెళుతున్న హీరో ‘తిరువీర్’. ఘాజీ, మల్లేశం, జార్జిరెడ్డి, పలాస వంటి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన తిరువీర్.. రీసెంట్ గా మెయిన్ లీడ్ లో ‘మాసూద’ సినిమాలో నటించాడు. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో తిరువీర్ నటనకు మంచి మార్కులు పడడమే కాకుండా ఆడియన్స్ లో మంచి గుర్తింపు లభించింది.

RC16 Heroine : రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమాలో సీతారామం హీరోయిన్?

ఇక ఈ మూవీ తరువాత ఈ హీరో నుంచి వస్తున్న తాజా చిత్రం ‘పరేషాన్’. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాంగ్స్ రిలీజ్ చేస్తూ వచ్చారు. ఆ సాంగ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే.. తిరువీర్ ఈ మూవీతో కూడా ఆడియన్స్ అలరించబోతున్నాడు అని అర్ధమవుతుంది. టీజర్ ఓపెనింగ్ లోనే మందుబాబుల కష్టాలను చూపిస్తూ.. ముందు తాగడం వలనే గవర్నమెంట్ రన్ అవుతుంది. అలాంటిది ఆడవాళ్లు మందుని బ్యాన్ చేయమని చెప్పడం ఏంటి. మా హక్కులను కాలరాస్తే ధర్నాలు కూడా చేస్తాం అంటూ టీజర్ లో మందుబాబులు రచ్చ రచ్చ చేశారు.

ఇక ఈ సినిమా మొత్తం తెలంగాణలోని ఒక గ్రామంలో జరగనున్నట్లు తెలుస్తుంది. టీజర్ తో అయితే ఒక విషయాని గట్టిగా చెప్పారు మేకర్స్.. ‘గిప్పుడే నిమ్మలం కార్రి, తర్వాత అంతా పరేషానే’ అంటున్నారు. టోటల్ గా మూవీ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని అర్ధమవుతుంది. కాగా ఈ సినిమాని రూపక రోనాల్డ్ సన్ డైరెక్ట్ చేస్తున్నాడు. వాల్తేరు ప్రొడక్షన్స్ పతాకం పై సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మిస్తున్నాడు. యశ్వంత్ నాగ్ సంగీతం అందిస్తున్నాడు. పావని కరణం, బన్నీ అభిరాం, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, శృతి రియాన్, బుద్దరాఖాన్ రవి, రాజు బెడిగేలా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.