Actress Hema: లిప్‌లాక్ వీడియోపై హేమ ఫైర్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకన్న సీనియర్ నటి హేమ, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించి ఓ పర్సనల్ వీడియోను సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో వైరల్ చేస్తున్నారంటూ హేమ తాజాగా సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాల క్రితం తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను, వీడియోను అసత్య ప్రచారంతో వైరల్ చేస్తూ తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె మండిపడింది.

Actress Hema: లిప్‌లాక్ వీడియోపై హేమ ఫైర్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!

Actress Hema Complaints To Cyber Crime On Liplock Video

Actress Hema: తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకన్న సీనియర్ నటి హేమ, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనకు సంబంధించి ఓ పర్సనల్ వీడియోను సోషల్ మీడియా, యూట్యూబ్‌లలో వైరల్ చేస్తున్నారంటూ హేమ తాజాగా సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. మూడు సంవత్సరాల క్రితం తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను, వీడియోను అసత్య ప్రచారంతో వైరల్ చేస్తూ తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగిస్తున్నారంటూ ఆమె మండిపడింది.

Actress Hema : నేను దర్శనానికి వచ్చాను.. కాంట్రవర్సీకి కాదు.. దుర్గమ్మ గుడిలో విలేఖరిపై ఫైర్ అయిన హేమ..

తన ఫ్యామిలీ యానివర్సరీ వీడియోని తప్పుడు థంబ్‌నేల్స్‌తో ఇప్పుడు వైరల్ చేశారని.. ముద్ధులతో రెచ్చిపోయిన నటి హేమ అంటూ ఇష్టమొచ్చిన రాతలు రాశారని.. తన భర్త, పిల్లలు మీడియాకు దూరంగా ఉంటారని.. ఇప్పుడు వాళ్లని కూడా ఇందులోకి లాగుతున్నారని హేమ తన ఫిర్యాదులో పేర్కొంది. తాజాగా నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్లుగా కూడా తప్పుడు వార్తలు రాశారని.. గతంలోనూ ఓ ప్రముఖ హీరో చనిపోయాడని, విడాకులు తీసుకున్నాడని ప్రచారాలు చేశారని.. ఇలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె కోరింది.

Hema : సిని ‘మా’ రాజకీయం.. ఒత్తిడి తట్టుకోలేకే పోటీ – హేమ..

కేవలం కొంతమంది తమ ఛానళ్ళు, వెబ్‌సైట్ల వ్యూయర్షిప్ కోసమో, బిజినెస్ కోసమో మాత్రమే ఇలా తమ ప్రైవేట్ లైఫ్‌ను డిస్టర్బ్ చేయడం ఏమాత్రం సరికాదని ఆమె తెలిపింది. గతంలో ఇలాంటివి జరిగినప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చామని.. అమెరికా నుంచి ఓ వ్యక్తిని ఇండియాకి రప్పించగా, సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారని హేమ తెలిపింది. ఇప్పుడు కూడా తప్పులు చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని పోలీస్‌లు హామీ ఇచ్చినట్లుగా ఆమె తెలిపింది. ఇక తనపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని.. వారి సంగతి తేలుస్తానని.. హేమ ఫైర్ అయ్యింది.