Himaja : నా పెళ్లికి నన్ను కూడా పిలవండి.. విడాకుల వార్తలపై స్పందించిన హిమజ..

నటి, బిగ్ బాస్ 3 ఫేమ్ హిమజ.. తన పెళ్లి, విడాకుల గురించి వస్తున్న వార్తలపై స్పందించింది..

Himaja : నా పెళ్లికి నన్ను కూడా పిలవండి.. విడాకుల వార్తలపై స్పందించిన హిమజ..

Himaja

Himaja: తెలుగు యాక్ట్రెస్, ‘బిగ్ బాస్ 3’ ఫేమ్ హిమజా రెడ్డి పెళ్లి గురించి, విడాకుల గురించి గురువారం రాత్రి నుండి సోషల్ మీడియాలో, పలు యూట్యూబ్ ఛానెళ్లలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఇదంతా నిజమేనా అంటూ తన ఫ్రెండ్స్ ఈ వీడియోల గురించి హిమజ దృష్టికి తీసుకెళ్లారు. షాక్ గురైన హిమజ రీసెంట్‌గా రెస్పాండ్ అవుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది.

Himaja : డ్రీం హౌస్ కట్టుకుంటున్న నటి హిమజ..

‘సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానెల్స్‌లో నా పెళ్లి, విడాకుల గురించి న్యూస్ రావడంతో షాక్ అయ్యాను. ప్లీజ్ నా పెళ్లికి నన్ను కూడా పిలవండి.. అలాగే నా విడాకుల గురించి కూడా నాకు చెప్పండి.. ఈ మధ్య నా వీడియోలు బ్యాక్ టు బ్యాక్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి’..

బిగ్ బాస్ 3 : హౌస్‌లో రచ్చ రచ్చ చేసిన హిమజ

‘ఇటీవల ఇల్లు కట్టిస్తున్న వీడియో కూడా షేర్ చేశాను. దాంతో ఎవరికో బాగా జలసీ కలిగి ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చారు. నా గురించి న్యూస్ రాసిన యూట్యూబ్ ఛానల్ వాళ్లని కామెంట్స్ రూపంలో తిట్టారు. వాళ్లందరికీ థ్యాంక్స్’.. అని చెప్పుకొచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by Himaja? (@itshimaja)