Jamuna : సినిమాలు, రాజకీయాలు, సమాజంలో ఎంతో సేవ.. అయినా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని జమున ఆవేదన..

కొన్నేళ్ల క్రితం జమున ఇచ్చిన ఇంటర్వ్యూలో పద్మ అవార్డులు, కేంద్రప్రభుత్వం గుర్తింపు లభించకపోవడంపై ఆమె స్పందించారు. జమున మాట్లాడుతూ.................

Jamuna : సినిమాలు, రాజకీయాలు, సమాజంలో ఎంతో సేవ.. అయినా కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని జమున ఆవేదన..

Jamuna :  తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి జమున నేడు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో కన్నుమూశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, హరనాథ్, జగ్గయ్య.. లాంటి స్టార్ హీరోలందరితో కలిసి నటించారు జమున. దాదాపు 190 కి పైగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లో నటించి మెప్పించారు. ఆమె మరణంతో టాలీవుడ్ లో మరోసారి విషాదం నెలకొంది. ఉదయం 11 గంటల నుండి జమున పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్ వద్దకు అభిమానులు, ప్రముఖులు సందర్శనార్థం తరలించారు. జమున మరణంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకి నివాళులు అర్పిస్తున్నారు.

జమున తన కెరీర్ లో ఎన్నో అవార్డుని గెలుచుకున్నారు. ఫిలింఫేర్ అవార్డులు, స్టేట్ అవార్డులు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, పలు స్థానిక అవార్డుని గెలుచుకున్నారు. సినిమాల్లోనే కాక రాజకీయాల్లో కూడా ఆమె ఎంపీగా పనిచేసి సేవలు అందించారు. రంగస్థల నటుల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళల కోసం పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఇన్ని రకాలుగా ఆమె పలు రంగాల్లో సేవ చేసినా కేంద్ర ప్రభుత్వం ఆమెకు తగిన గుర్తింపు ఇవ్వలేదు అని కొన్నేళ్ల క్రితం జమున వ్యాఖ్యానించారు. పలువురు ప్రముఖులు కూడా జమునకి పద్మ పురస్కారం వచ్చి ఉండాల్సింది అని అభిప్రాయపడ్డారు. ఆవిడ తర్వాత వచ్చిన వాళ్లకి, ఆవిడ కంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళకి కూడా ఇవ్వడంపై ఆమె మాట్లాడారు.

Jamuna Issue with NTR & ANR : జమునని బాయ్‌కాట్ చేసిన ఎన్టీఆర్, ఏఎన్నార్.. సారీ చెప్పమంటే తగ్గేదేలే అన్న జమున..

కొన్నేళ్ల క్రితం జమున ఇచ్చిన ఇంటర్వ్యూలో పద్మ అవార్డులు, కేంద్రప్రభుత్వం గుర్తింపు లభించకపోవడంపై ఆమె స్పందించారు. జమున మాట్లాడుతూ.. నేను సినిమాలు, రాజకీయాల్లో సక్సెస్ అయ్యాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అయినా నన్ను ప్రభుత్వాలు గుర్తించలేదు. నా కంటే తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా అవార్డులు ఇచ్చారు. పద్మ అవార్డుల విషయంలో పైరవీలు జరుగుతాయి. అక్కడికి వెళ్లి కూర్చొని మాట్లాడుకుంటారు. నాకు అలాంటివి ఇష్టం లేదు. ఇప్పుడు పద్మ అవార్డులకు ఉండే విలువ పోయింది. అలాంటప్పుడు ఆ అవార్డులు రాకపోయినా పర్లేదు. హీరోయిన్ గా 25 సంవత్సరాలు లాంగ్ కెరీర్ పూర్తి చేసుకున్నప్పుడు సుబ్బిరామిరెడ్డి గారు నాకు సన్మాన సభ ఏర్పాటు చేస్తే ఢిల్లీ నుంచి కూడా నాయకులు వచ్చారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, LK అద్వానీ.. లాంటి ఎంతో మంది మహామహుల మధ్య నాకు సన్మానం చేశారు. ఆ సమయంలో నాకు ప్రజానటి అని బిరుదు ఇచ్చారు. దానికి నేను చాలా సంతోషించాను అని తెలిపారు.