Actress Jayanti: అలనాటి సీనియర్ నటి జయంతి కన్నుమూత

ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూశారు. 1963లో సినీ అరంగ్రేటం చేసిన ఆమె 500కు పైగా సినిమాలు చేశారు.

10TV Telugu News

Actress Jayanti: ప్రముఖ సినీ నటి జయంతి కన్నుమూశారు. 1963లో సినీ అరంగ్రేటం చేసిన ఆమె 500కు పైగా సినిమాలు చేశారు. కొద్ది రోజులుగా శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని ఆమె నివాసంలో తుది శ్వాస విడిచారు. ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆమె… ఆస్తమా సమస్యతో చనిపోయినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. జయంతి మరణానికి సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

1945 జనవరి 6న బళ్ళారిలో జన్మించిన జయంతి గత 35 సంవత్సరాల నుంచి అస్తమా సమస్యతో బాధపడుతున్నారు. కన్నడ సినిమా జెను గూడు(1963)తో తెరంగేట్రం చేసిన జయంతి అనేక హిందీ, మరాఠీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించారు.

దాదాపు 500పైగా సినిమాల్లో నటించిన జయంతి 300 సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. తెలుగులో భార్యాభర్తలు సినిమాతో కెరీర్ ప్రారంభించి, జగదేక వీరుడి కథ, డాక్టర్ చక్రవర్తి, జస్టిస్ చౌదరీ, దొంగ మొగుడు, కొదమ సింహం, పెదరాయుడు, సైరా నర్సింహారెడ్డి చిత్రాల్లో నటించారు.

10TV Telugu News