కాజల్‌కి నరకం చూపించిన జెట్ ఎయిర్‌వేస్

హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి, చుక్కలు చూపించిన జెట్ ఎయిర్‌వేస్ స్టాఫ్

  • Published By: sekhar ,Published On : January 3, 2019 / 10:20 AM IST
కాజల్‌కి నరకం చూపించిన జెట్ ఎయిర్‌వేస్

హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి, చుక్కలు చూపించిన జెట్ ఎయిర్‌వేస్ స్టాఫ్

హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కి, జెట్ ఎయిర్‌వేస్ స్టాఫ్ చిరాకు తెప్పించారట. దాంతో, తనకోపాన్నంతా ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చింది కాజల్.. గతంలోనూ చెకింగ్‌ల పేరిట, వెయిటింగ్‌ల పేరుతో ఇబ్బందులు ఎదుర్కొన్న సెలబ్రెటీల్ని మనం చూసాం. ఇంతకీ కాజల్ విషయంలో ఏం జరిగిందంటే.. తను ఫ్లైట్ టైమ్‌కంటే 75నిమిషాల ముందే ఎయిర్ పోర్ట్‌కి వస్తే, మొయిన్ కౌంటర్‌కి చెందిన సిబ్బంది తన టైమ్ అంతా వేస్ట్ చేసాడట. అంతే కాకుండా, ఇంటర్నేషనల్ టెర్మినల్ నుండి తీసుకొచ్చిన ఫ్లైట్‌ని, డొమెస్టిక్ టెర్మినల్ దగ్గర పార్క్ చెయ్యడంతో దాదాపు 30నిమిషాల సమయం వృధా అయ్యిందని కాజల్ కోప్పడింది.

ఒక గంటసేపు డోర్స్ అన్నీ క్లోజ్ చేసి, చుక్కలు చూపించారని, తన బాధనంతా ఒక ట్వీట్ రూపంలో చెప్పుకొచ్చింది. దీంతో కాజల్‌కి ఆమె ఫ్యాన్స్ నుండి భారీ స్థాయిలో సపోర్ట్ లభిస్తుంది. జెట్ ఎయిర్‌వేస్‌పై మండిపడుతూ వాళ్ళు ట్వీట్‌లు చేస్తున్నారు. సదరు జెట్ ఎయిర్‌వేస్ సంస్థ కూడా అసలెక్కడ పొరపాటు జరిగిందో ఎంక్వైరీ చేస్తామని కాజల్ ట్వీట్‌కి రిప్లై ఇచ్చింది.