Kangana Ranaut: బాలీవుడ్‌పై అక్కసు.. కంగనా శ్రీరంగనీతులు!

ఫైర్ బ్రాండ్ గా ఎప్పుడూ కాంట్రవర్సీలతో మునిగితేలే కంగనా.. బాలీవుడ్ స్టార్లని తిట్టడానికి వచ్చిన ఏ ఛాన్స్ నీ వదులుకోదు. అసలు ఆ హీరో, ఈ హీరోయిన్ అన్నతేడా లేకుండా ఆ టాపిక్..

Kangana Ranaut: బాలీవుడ్‌పై అక్కసు.. కంగనా శ్రీరంగనీతులు!

Kangana Ranaut: ఫైర్ బ్రాండ్ గా ఎప్పుడూ కాంట్రవర్సీలతో మునిగితేలే కంగనా.. బాలీవుడ్ స్టార్లని తిట్టడానికి వచ్చిన ఏ ఛాన్స్ నీ వదులుకోదు. అసలు ఆ హీరో, ఈ హీరోయిన్ అన్నతేడా లేకుండా ఆ టాపిక్.. ఈ టాపిక్ అన్న డిఫరెన్స్ లేకుండా స్టార్లు ఏం చేసినా.. దొరికొందే ఛాన్సని ఇష్టవచ్చినట్టు నోరు పారేసుకుంటోంది కంగనా.

Prabhas Movies: పాపం ప్రభాస్.. ఆగని గ్లోబల్ స్టార్ వాయిదాల పర్వం!

బాలీవుడ్ క్వీన్ కంగనా సోషల్ మీడియాలో మరో సారి హాట్ టాపిక్ అయ్యింది. సస్టెయిన్ అయ్యేది బాలీవుడ్ లో అయినా.. ఛాన్సొస్తే.. బాలీవుడ్ స్టార్లని తిట్టడానికి ఏ మాత్రం మొహమాటపడదు కంగనా. హీరోలు, హీరోయిన్లు అన్నతేడా లేకుండా ఏం చేసినా సరే.. ఏదోఒకటి కాంట్రవర్సీ చెయ్యడానికి రెడీగా ఉంటుంది కంగనా. లేటెస్ట్ గా ఆలియా భట్ మీద సోషల్ మీడియాలో ఇంతెత్తున లేచింది కంగనా.

Sreeleela: క్రేజీ ఆఫర్లు.. వరుస సినిమాలకు సైన్ చేస్తున్న శ్రీలీల?

ఆలియా భట్.. సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్లో ఓ సెక్స్ వర్కర్ లైఫ్ స్టోరీ గంగూభాయ్ పేరుతో తెరకెక్కింది. ఈ సినిమా మరో 10 రోజుల్లో రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి ప్రమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు టీమ్. అయితే లేటెస్ట్ గా ఆలియా భట్ డైలాగ్ ని ఇన్ స్టాలో ఓ చిన్నారి రీల్ లో ఇమిటేట్ చేసింది. సేమ్ టూ సేమ్ ఆలియా డ్రెస్, ఎక్స్ ప్రెషన్స్ తో అమేజింగ్ రీల్ చేసింది.

Kiran Abbavaram: సెబాస్టియన్ వీడియో సాంగ్.. నీ మాట వింటే రాదా మైమరపే..!

సందు దొరికింది కదా అని ఆ రీల్ ని కూడా కాంట్రవర్సీ చేసింది. నోట్లో బీడీ పెట్టుకుని ఓ సెక్స్ వర్కర్ ని ఇమిటేట్ చేస్తూ.. ఈ వయసులో ఆ పాపను సెక్సువలైజ్ చెయ్యడం కరెక్టేనా, ఇలా చాలా మంది పిల్లలు ఈ వీడియోని ఇమిటేట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు అంటూ దేశ స్త్రీ శిశు సంక్షేమ మంత్రి స్మృతి ఇరాని కి ట్యాగ్ చేసింది కంగనా. ఒక్క చిన్న రీల్ కి ఇంత కాంట్రవర్సీ చేస్తున్నందుకు.. అంతకుముందు ఇలాంటి సెక్సువల్ క్యారెక్టర్స్ చేసి కూడా ఇప్పుడు గురువింద నీతులు చెబుతున్నందుకు రివర్స్ కౌంటర్లిస్తున్నారు కొంతమంది.

Bheemla Nayak: కలెక్షన్ల సునామీకి పవర్ స్టార్ స్కెచ్… ఫ్యాన్స్‌కు పునకాలే!

నిన్నకాక మొన్న మరో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ మీద విరుచుకపడింది. శకున్ బత్రా డైరెక్షన్లో దీపికా, అనన్యపాండే, సిద్దాంత్, ధైర్య లీడ్స్ లో రిలీజ్ అయిన సినిమా మీద ఓ రేంజ్ లో నెగెటివ్ కామెంట్స్ చేసింది. అసలు ఇలాంటి సినిమాలు చేసి సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటూ సోషళ్ మీడియాలో కామెంట్లు పెట్టి తెగబాధపడిపోతోంది కంగనా.

Movies Leakage: లీకుల బెడద.. ఇప్పుడు మరింత స్ట్రిక్ట్!

ఓ రిలేషన్ దారి తప్పితే వచ్చే ట్రబుల్స్ ని కళ్లకు కట్టినట్టు చూపించిన గెహరాయియా సినిమా రిలీజ్ కు ముందు కూడా దీపికాతో పాటు ఈ సినిమా మీద విరుచుకుపడింది కంగనా. హుక్ అప్ షో ప్రెస్ మీట్ లో.. ఓరిపోర్టర్ అడిగిన ప్రశ్నకు.. గెహరాయియా సినిమా గురించి మాట్లాడాలనుకునేవాళ్లు బయటికెళ్లి మాట్లాడండి.. అంటూ మీడియాతో హార్ష్ గా బిహేవ్ చేసి మరోసారి దీపికా, ఆలియా మీద తన అక్కసు బయటపెట్టింది కంగనా.

Mahesh-Vijay: ఫ్యాన్స్ మధ్య సిల్లీ వార్.. దెబ్బకి నెవెర్ బిఫోర్ రికార్డ్స్!

ఛాన్స్ దొరికితే.. వాళ్లూ వీళ్లన్న తేడా లేకుండా వరుసపెట్టి హీరోలందర్నీ ఆడిపోసుకునే కంగనా.. మొన్నీమధ్య మరో సారి రెచ్చిపోయింది. బాలీవుడ్ హీరోలకి పద్దతి పాడూలేదని, ఇండియన్ కల్చర్ కి వాల్యూ ఇవ్వరని శ్రీరంగనీతులు చెబుతోంది. ఇవే కాదు.. అసలు ఇష్యూతో సంబంధం లేకుండా కరణ్ జోహార్ ని నోటికొచ్చినట్టు తిట్టే కంగనా.. నెపొటిజం వంకతో బాలీవుడ్ స్టార్లందరి మీదా నోరు పారేసుకుంది. నెపొటిజంతో టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలు లేకుండా చేస్తున్నారంటూ, స్టార్ కిడ్స్ నే ఎంకరేజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటోంది కరణ్ జోహార్ ని. ఫేమ్, నేమ్ వచ్చిన తర్వాత ఒకప్పుడు తనకి ఛాన్స్ ఇచ్చి కెరీర్ లో హెల్ప్ చేసిన కరణ్ మీద ఇలా విరుచుకు పడడటం.. కంగనా డబుల్ స్టాండర్డ్స్ కి అర్దం అని, స్టార్లు ఏం చేసినా ఇలా ఏడుస్తూనే ఉంటుందని నెటిజన్స్ తెగ తిట్టిపోస్తున్నారు.