ChaySam : సంసారాలన్నీ రచ్చబండలు.. బతుకు జట్కా బండ్లే.. మాధవి లత షాకింగ్ కామెంట్స్..

సమంత - నాగ చైతన్య విడిపోవడం వెనుకగల కారణాలను వివరంగా చెప్పుకొచ్చింది నటి మాధవి లత..

ChaySam : సంసారాలన్నీ రచ్చబండలు.. బతుకు జట్కా బండ్లే.. మాధవి లత షాకింగ్ కామెంట్స్..

Maadhavi Latha

ChaySam: అక్కినేని నాగ చైతన్య – సమంతల విడాకుల వ్యవహారం మీడియా అండ్ సోషల్ మీడియా, సినీ వర్గాలు అలాగే అక్కినేని అభిమానుల్లో హాట్ టాపిక్ అయ్యింది. గతకొద్ది రోజులుగా వస్తున్న వార్తలను వాస్తవం చేస్తూ చై -సామ్ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.

Naga Chaitanya – Samantha : కన్ఫామ్.. విడిపోయిన నాగ చైతన్య – సమంత

వీళ్లిద్దరూ విడిపోవడానికి ఇవే కారణాలు అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. రీసెంట్‌గా నటి మాధవీ లత.. చై – సామ్ విడాకుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో ఓ నెటిజన్ సమంత – చైతన్య విడాకుల గురించి అడిగాడు.

ChaySam : విడిపోతూ కూడా ఒకేమాట..

మాధవీ లత మాట్లాడుతూ.. ‘‘విడాకుల గురించి మూడు విషయాలు విన్నాను.. 1) సినిమా వాళ్లు పెళ్లిల్లు చేసుకుంటే కలిసి ఉండరు.. విడిపోతారు.. 2) సామ్ క్రిస్టియన్.. ఈ క్రిస్టియన్స్ ఇలానే ఉంటారు.. 3) పెళ్లి తర్వాత కూడా ఒళ్లు కనిపించేలా గ్లామర్ డ్రెస్సులు వేసుకుంటుంది.. సినిమా వాళ్లే కాదు.. బయట కూడా సంసారాలన్నీ రచ్చబండలు.. బతుకు జట్కా బండ్లే.. పెళ్లి బట్టలతోనే వచ్చి విడాకులు కావాలని అడిగేవాళ్లు ఎంతమంది ఉన్నారో డైవర్స్ స్పెషలిస్ట్ లాయర్లను అడిగితే చెప్తారు. వాళ్లతో కంపేర్ చేసుకుంటే సెలబ్రిటీలు చాలా తక్కువ మంది డైవర్స్ తీసుకుంటారు. సెలబ్రిటీలు కాబట్టి ఎక్కవగా హైలెట్ అవుతుంటారు. రోజూ గొడవలు పడే కంటే మ్యూచ్‌వల్ అండర్ స్టాండింగ్‌తో చాలామంది విడిపోతుంటారు.. అలాంటి వాళ్లు లైఫ్ టైమ్ ఫ్రెండ్స్‌గా ఉంటారు. ఫ్రెండ్స్‌గా ఉన్నవాళ్లు భార్య భర్తలుగా ఉండలేరా అంటే ఉండలేరు.. ఎందుకంటే ఫ్రెండ్స్ వేరు, పార్టనర్ వేరు’’..

ChaySam : 4 ఏళ్లు.. 4 సినిమాలు.. ఫైనల్‌గా 4 రోజుల ముందే..!

2) ‘‘సమంత క్రిస్టియన్.. హిందూ ధర్మం గురించి తెలియదు అంటున్నారు. సామ్ ఎప్పుడూ హిందు దేవుళ్లను కానీ, హిందుత్వం గురించి కానీ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. పెళ్లి తర్వాత కాలినడకన తిరుపతి మెట్లెక్కి వెళ్లి, తాళి బొట్టుని కళ్లకు అద్దుకుంది’’..

ChaySam : నాగ చైతన్యను గ్రూపులో యాడ్ చేసిన ప్రభాస్

3) ‘‘పెళ్లి అయిన తర్వాత కూడా గ్లామర్ బట్టలేసుకుంటుంది.. అందుకే వదిలేసాడు అంటున్నారు.. అలా అయితే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌ని వదిలెయ్యాలి.. దీపిక పదుకొనేని రణ్‌వీర్ సింగ్ వదిలెయ్యాలి.. తెరమీద వేసుకునే బట్టలకి, మొగుడు పెళ్లాల కాపురానికి సంబధముందడదు.. నాగార్జున, రామానాయుడు కూతురు, వెంకటేష్ సిస్టర్‌కి విడాకులిచ్చిన్నప్పుడు ఎవరూ ఆమె గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఆమె ఎవరో పెద్దగా తెలియదు. ఆమె గురించి కానీ నాగార్జున గురించి కానీ మాట్లడలేదు.. ఇప్పుడు సమంత గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. సమంత, చైతన్యకి కానీ నాగార్జునకి కానీ తెలియకుండా సినిమాలు చెయ్యలేదు. మీరొక్కసారి యాంకర్ ప్రదీప్ షోలో ఆమె చాలా క్లియర్‌గా చెప్పింది. ‘నాకిప్పుడు 29 ఇయర్స్.. 30 ఇయర్స్ వచ్చే సరికి నేను తల్లినవ్వాలి.. ఎందుకంటే నా కూతురికి 15 ఇయర్స్ వచ్చే సరికి నాకు 45 ఇయర్స్ ఉంటే.. తను మమ్మీ లెట్స్ ప్లే సమ్‌థింగ్ అని అడిగితే నేను తనతోపాటు కలిసి ఎనర్జిటిక్‌గా ఆడుకోగలను.. అదే నాకు 50, 55 వచ్చినప్పుడు నా కూతురు పిలిస్తే వెళ్లలేను’.. అని క్లియర్‌గా చెప్పింది.. అంటే సమంతకి మధర్ అవ్వడం అనేది చాలా ఇష్టమైన పని.. కానీ ఆమె ప్రెగ్నెంట్ అయితే తనకు సినిమాలు రావు అని తల్లి కాకుండా ఎవరు ఆపారు?.. మీ అందరికీ సమంత బట్టలు మాత్రమే తెలుసు.. ఆమె చాలా మంచిది.. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తుంటుంది.. సినిమా తప్ప ఇతరత్రా లాంచింగ్ ఈవెంట్స్‌కి సంబంధించిన మీన అంతా కూడా ఆ ఫౌండేషన్ అకౌంట్‌లోనే వెయ్యమని చెప్పేది’’..

మనిషిలా కాదు.. మనీ మెషిన్‌లా చూశారు..

గతంలో ఓ హీరోని ప్రేమించి మోస పోయింది.. వాళ్లు కూడా ఆమెను డబ్బుకోసం ఒక మనీ మెషిన్‌లా వాడుకున్నారు.. పెళ్లి తర్వాత కూడా మధర్ అవ్వాలనే ఆశను చంపేసుకుని మరీ రోబోలా పని చేస్తూనే ఉంది.. దయచేసి ఆమె గురించి కామెంట్స్ చెయ్యకండి.. హెల్పింగ్ నేచర్ కలది.. చాలా మంచి అమ్మాయి.. పెళ్లైన తర్వాత పాకెట్ మనీ ఇస్తారు ఆమెకి.. మీలో ఎంతమందికి తెలుసు ఈ విషయం.. కోట్లు సంపాదించి వేలు పాకెట్ మనీ ఇస్తారు.. ఆ డబ్బుతోనే బతకాలి.. అలాంటి బతుకు బతికే కంటే తన లైఫ్ తను చూసుకోవడం చాలా బెస్ట్.. తల్లి అవ్వాలనే ఆశను నెరవేర్చుకోలేదు.. కనీసం సమాజ సేవ చెయ్యడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు.. సమంత విషయంలో చాలా చెడుగా మాట్లాడుతున్నారు.. దయచేసి అలా కామెంట్స్ చెయ్యకండి.. రూపాయి బయటకు తియ్యడం ఇష్టం లేని కుటుంబం నుంచి సమంత బయటకు రావడం మంచిదే.. ఇవి నాకు తెలిసిన విషయాలు కాబట్టి మీతో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను’’ అని చెప్పుకొచ్చింది మాధవి లత..

Samantha: ముందు నన్ను నేను మార్చుకోవాలి.. సామ్ ట్వీట్ వైరల్!