చాలా టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ తీసుకుంటారు.. నేను చూశాను: మాధవి లత..

  • Edited By: sekhar , September 2, 2020 / 07:17 PM IST
చాలా టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ తీసుకుంటారు.. నేను చూశాను: మాధవి లత..

Madhavi Latha Face To Face with 10TV: ‘టాలీవుడ్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతారు.. దీనిపై తెలంగా NCB అధికారులు, ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి’ అంటూ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లత ఇటీవల ఫేస్‌బుక్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ వ్యవహారం గురించి 10టీవీతో మాట్లాడారు మాధవి లత..
‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఎంత సంచలనంగా మారిందో చూస్తున్నాం. రెండు రాష్ట్రాల పోలీసులతోపాటు సీబీ, సిఐడి నుండి ఎన్‌సిబి వరకూ వెళ్లింది. ఇక్కడ 2010లో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. అసలు టాలీవుడ్ లోకి డ్రగ్స్ ఎలా వస్తున్నాయి, ఎవరు సప్లై చేస్తున్నారు అనేది తెలియాలి.

ఒక్కసారి సెలబ్రిటీలు బయటకొచ్చి ‘సే నో టు డ్రగ్స్’ అని చెప్తే ఆ నినాదం జనాల్లోకి వెళ్తుంది. నేను పార్టీలకు వెళ్లి ఐదు సంవత్సరాలు అయింది. అప్పుడు నేను వెళ్లిన పార్టీల్లో డ్రగ్స్ తీసుకోవడం నా కళ్లారా చూశాను. బీజేపీ లీడర్‌గా, బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లాలనే నేను ఈ పోస్ట్ పెట్టాను’’.. అని వివరించారు మాధవి లత..