Meena : నటి మీనా ఫ్యామిలీ మొత్తానికి కరోనా..

నటి మీనాతో పాటు తన ఫ్యామిలీ అందరికి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

Meena : నటి మీనా ఫ్యామిలీ మొత్తానికి కరోనా..

Meena

Meena :  ఒకప్పటి స్టార్ హీరోయిన్ మీనా ఇప్పటికి కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఇటీవలే ‘దృశ్యం 2’, ‘పెద్దన్న’ సినిమాలతో అలరించింది. తాజాగా మీనా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అది చూడటానికి ఫన్నీగా, వ్యగ్యంగా అనిపించినా సీరియస్ మ్యాటర్ ని మీనా ఆలా పోస్ట్ చేయడం విశేషం. నటి మీనాతో పాటు తన ఫ్యామిలీ అందరికి కరోనా సోకిందని సోషల్ మీడియా ద్వారా తెలియచేసింది.

Akhanda : ఓటీటీలో ‘అఖండ’.. ‘పుష్ప’ తర్వాతే..

ఈ విషయంపై మీనా ట్వీట్ చేస్తూ.. ”2022లో మా ఇంటికి వచ్చిన తొలి అతిథి మిస్టర్ కరోనా. మా కుటుంబం మొత్తాన్ని ఇష్టపడింది. కానీ, నేను దానికి మా ఇంట్లో చోటు ఇవ్వను. ప్రజలారా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. బాధ్యతగా మసులుకోండి. కరోనా వ్యాప్తికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రార్థనల్లో మాకు కూడా చోటివ్వండి” అంటూ పోస్ట్ చేశారు. ఇలా ఫ్యామిలీ మొత్తానికి కరోనా రావడాన్ని భయపడకుండా చాలా క్యాజువల్ గా పోస్ట్ చేసి జాగ్రత్తలు చెప్పడంతో ఒక పక్క మీనాని అభినందిస్తూనే మరో పక్క మీనాతో పాటు ఆమె ఫ్యామిలీ కూడా త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.