Actress Promotions: డబ్బిస్తే చాలు.. ఏ ప్రొడక్ట్‌కైనా మేము సిద్దమే!

సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే కోట్లమంది ఫాలోవర్స్.. ఒక కమర్షియల్ యాడ్ పోస్ట్ చేస్తే కోట్లు వచ్చి పడే ఆఫర్.. ఎవరు కాదనుకుంటారు.. అసలే దీపం ఉండగానే ఇళ్లు చక్కబట్టాలనే థీరిని మన హీ

Actress Promotions: డబ్బిస్తే చాలు.. ఏ ప్రొడక్ట్‌కైనా మేము సిద్దమే!

Actress Promotions

Actress Promotions: సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తే కోట్లమంది ఫాలోవర్స్.. ఒక కమర్షియల్ యాడ్ పోస్ట్ చేస్తే కోట్లు వచ్చి పడే ఆఫర్.. ఎవరు కాదనుకుంటారు.. అసలే దీపం ఉండగానే ఇళ్లు చక్కబట్టాలనే థీరిని మన హీరోయిన్స్ బాగా ఫాలోఅవుతారు. అందుకే ఎంతలా ట్రోలింగ్ జరుగుతున్నా.. హీరోయిన్స్ మాకు నచ్చినట్టు మేముంటామంటారు. ఇప్పుడలాగే సమంతా సోషల్ మీడియాలో ఓ యాడ్ పోస్ట్ చేసి అంతా నా ఇష్టం అంటోంది. ఆల్కహాల్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది సమంతా. అది కాస్త వైరల్ గా మారి ట్రోలింగ్ కి కారణమైంది. ఇందులో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ పై కూడా నెటిజన్స్ నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

Senior Actress: సిల్వర్ స్క్రీన్‌ని ఏలిన సీనియర్లు.. మళ్ళీ రీఎంట్రీ!

సమంతాకి కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్, షాప్ ఓపెనింగ్స్.. ఇవేమి కొత్తేం కాదు.. గ్లామర్ ఉన్నప్పుడే సంపాదించుకోవాలని ఆమె చాలాసార్లు పబ్లిక్ గానే చెప్పింది కానీ ఓ ఆల్కహాల్ ను కోట్లమందికి ప్రమోట్ చేయడమే ఇప్పుడు ఆమెను సర్కిల్ చేసింది. ఈమధ్యే రష్మిక సైతం ఇలానే ట్రోలింగ్ కి గురైంది. నేషనల్ వైడ్ పాపులారిటీ.. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రష్మిక.. ఓ అండర్ వేర్ యాడ్ లో నటించి విమర్శలపాలైంది. యోగా ఇన్ స్ట్రక్టర్ అయిన క్రష్మిక.. విక్కీ కౌశల్ అండర్ వేర్ కి ఇంప్రెస్ అయినట్టు యాడ్ తీయడం.. ఆమె ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టింది. ఇలాంటి మెటిరీయల్ దొరకగానే ట్రోలింగ్స్ తో సోషల్ మీడియా రాయుళ్లు సైతం రెచ్చిపోయారు.

Tollywood Actress: ముంబైలో తెగ సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

సెలబ్రిటీస్.. సంపాదన కోసం యాడ్స్ చేయడం కామన్. కానీ ఆరోగ్యానికి హాని కలిగించే బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడమేంటనేది కొందరి నెటిజన్స్ వాదన. ఒక్క సమంతా మాత్రమే కాదు పూజా హెగ్డే, నిధి అగర్వాల్, రెజీనా, హన్సిక, పాయల్ రాజ్ పుత్, ఇలియానా వంటి హీరోయిన్స్ తో పాటూ కాజల్ కూడా ఆమధ్య తన భర్త కిచ్లూతో ఓ ఆల్కహాల్ బ్రాండ్ ని ప్రమోట్ చేసింది. ప్రమోషన్ మెటిరీయల్ ఎలా ఉండలనేదానిపై ఒక్కో హీరోయిన్ ఒపీనియన్ ఒక్కోలా ఉంటుంది. బ్యాన్ అయిన ప్రొడక్ట్స్ నేమీ మేము ప్రమోట్ చేయట్లేదు కదా అని కొందరంటే.. అసలు సొసైటీకి పనికిరాని ప్రొడక్ట్స్ కి మేము దూరమంటారు కొంతమంది హీరోయిన్స్. ఇలా చూస్తే సెకండ్ లిస్ట్ లో ఫస్ట్ పేరు మాత్రం సాయిపల్లవిదే కనిపిస్తోందిప్పుడు.

Trolls On Actress: ట్రోల్ అవుతున్న హీరోయిన్స్.. నెటిజన్స్ ఎటాక్!

డైరెక్టర్ సుకుమార్ చెప్పినట్టు లేడీ పవర్ స్టార్ అనిపించుకునే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సాయిపల్లవికి. కానీ రిలీజ్ అవ్వని విరాటపర్వం తప్ప ఇప్పుడామె చేతిలో పెద్దగా సినిమాలే లేవు. కారణం.. ఆమెకు నచ్చిన సినిమాలే చేస్తుండటం. తనకంటూ స్పెషల్ బ్రాండ్ సృష్టించుకోవడం. అలాగే ఎన్ని కోట్ల ఆఫర్ వచ్చినా.. తన దగ్గరికొచ్చిన కమర్షియల్ బ్రాండ్స్ కీ ఆమె సింపుల్ గా నో చెప్పేస్తారు. డబ్బు కోసం జనాల్ని మభ్యపెట్టే యాడ్స్ చేయకూడదనేది సాయిపల్లవి మెంటాలిటీ. మేకప్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు సాయిపల్లవి. ఒరిజినాలిటి ఆత్మవిశ్వాసాన్ని నింపాలే కానీ దానికి మేకప్ వేసి పొగొట్టుకోకూడదంటారు. అందుకే 2 కోట్లతో వచ్చిన ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్ ని వద్దనుకున్నారు. సినిమాల్లో ఎలా అయితే ఆచితూచి వ్యవహరిస్తారో.. తనను అభిమానించే వారికోసం తనదైన స్టైల్ లోనే కనిపించాలని అనుకుంటుంది సాయి పల్లవి.

Actress Workouts: గ్లామర్ క్వీన్స్ వర్కౌట్ పాఠాలు.. ఫ్యాన్స్ ఫిదా!

లావణ్య త్రిపాఠి సైతం ఓ ఆల్కహాల్ బ్రాండ్ ను జనాల ముందుకు తీసుకొచ్చేందుకు ఇష్టపడలేదు. పెద్దగా వివాదాలు, కాంట్రవర్సీల్లో కనిపించని లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్సే ఉన్నారు కానీ వ్యసనాలకు సంబంధించిన యాడ్స్ చేసి సొమ్ము చేసుకోవాలనే ఉద్ధేశ్యం తనకు లేదని చెప్పేసింది. సౌత్ బిగ్ స్టార్ నయనతార లాంటి కొందరు గ్లామర్ క్వీన్స్ కూడా యాడ్స్ విషయంలో వాళ్లకంటూ కొన్ని కండీషన్స్ పెట్టుకున్నారు.