Back Door Review: హద్దులు దాటమనే వయసు.. తప్పని చెప్పే మనసు.. ‘బ్యాక్ డోర్’

పూర్ణ ప్రధాన పాత్రలో బ్యాక్ డోర్ అనే సినిమా ఓ సినిమా రాబోతుందని ప్రకటించారు. ఈ సినిమా టీజర్లు వచ్చిన తర్వాత ఇదేదో యూత్ ఫుల్ కాన్సెప్ట్ గా కనిపించడంతో ప్రేక్షకుల దృష్టిని..

Back Door Review: హద్దులు దాటమనే వయసు.. తప్పని చెప్పే మనసు.. ‘బ్యాక్ డోర్’

Back Door

Back Door: సీమ టపాకాయ్, ఆవును, లడ్డు బాబు, నువ్విలా నేనిలా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కేరళ కుట్టి పూర్ణ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు పాత్ర నచ్చితే స్టార్ హీరోల సినిమాలలో పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. కాగా, ఆ మధ్య పూర్ణ ప్రధాన పాత్రలో బ్యాక్ డోర్ అనే సినిమా ఓ సినిమా రాబోతుందని ప్రకటించారు. ఈ సినిమా టీజర్లు వచ్చిన తర్వాత ఇదేదో యూత్ ఫుల్ కాన్సెప్ట్ గా కనిపించడంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ ‘బ్యాక్ డోర్’ సినిమా.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది. డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం.

Omicron Effect on Films: టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో?!

నటీనటులు: పూర్ణ, తేజ త్రిపురాన తదితరులు
సినిమాటోగ్రఫీ: శ్రీకాంత్ నారోజ్
సంగీతం: ప్రణవ్
ఎడిటింగ్‌: చోటా కె.ప్రసాద్
కో-ప్రొడ్యూసర్ : ఊట శ్రీను
నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి
రచన, దర్శకత్వం: కర్రి బాలాజీ

Ashu Reddy Oo Antava Song: ఊ అంటావా మావా.. ఇరగదీసిన అషు!

కథ:
అంజలి (పూర్ణ) హౌస్ వైఫ్. ఆమె భర్త బిజినెస్ మెన్.. కెరీర్, సంపాదన అంటూ ఎప్పుడూ ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటాడు. అన్యోన్యంగానే ఉండే ఈ జంటకు ఇద్దరు పిల్లలు. అంజలి కుటుంబానికి కావాల్సిన పనులు చూసుకుంటూ సంతోషంగా గడుపుతుంది. అయితే, ఓ పెళ్లిలో అరుణ్ (తేజ త్రిపురాన) అంజలికి పరిచయం కావడం.. అంజలి అరుణ్ మాటలకు, సరదా వ్యక్తిత్వానికి అట్రాక్ట్ అయిపోతుంది. అంజలి అందానికి అరుణ్ ఫిదా అవుతాడు. ఫోన్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న అరుణ్, అంజలి అక్కడితో ఆగకుండా అడుగు ముందుకేసేందుకు సిద్ధమవుతారు. పిల్లలు స్కూల్ కు, భర్త ఆఫీస్ కు వె‌ళ్లిన తర్వాత అరుణ్ ను ఇంటికి పిలుస్తుంది అంజలి. అప్పటికే అంజలి అందాన్ని ఆస్వాదించాలని ఆరాటపడుతున్న అరుణ్.. అంజలి ఇంటికి వస్తాడు. మనసు మాట వినని వయసు.. రెచ్చగొట్టే ఆ సమయంలో ఏం జరిగింది.. వాళ్ళు అనుకున్నదే జరిగిందా.. ఊహించనిది జరిగిందా అనేది మిగతా కథ.

Release Postpone: సర్వం సిద్ధం.. కానీ.. తప్పని రిలీజ్ డేట్స్ రీ షెడ్యూల్

విశ్లేషణ:
సినిమాతో ఓ మంచి విషయాన్ని చెప్పాలి.. అలా చెప్తే ప్రేక్షకులు చూడరు కదా.. అందుకే ఆ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి. అలా తెరకెక్కిందే బ్యాక్ డోర్ సినిమా. మెసేజ్ ఫ్లస్ ఎంటర్ టైన్ మెంట్ కలిపి చెప్పాలని దర్శకుడు బాలాజీ ప్రయత్నించాడు. సహజంగానే ఇలాంటి సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే భర్త కెరీర్ లో పడి పట్టించుకోని భార్య.. అందునా గర్ల్ నీడ్స్ ఆ బాయ్ అని తెలిసేలోపే పెళ్ళై పోయిన మహిళ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. చూపు వెళ్లే ప్రతి చోటకి మనసు వెళ్ళకూడదు.. అలాగే మనసు చెప్పే ప్రతి మాట మనిషి వినకూడదు.. ఇదే దర్శకుడు చెప్పాలనుకున్నది.. దాని కోసం క్రైమ్ టచ్ ఇచ్చి ప్రోబ్లమ్స్ క్రియేట్ చేశాడు. వీలైనంత కమర్షియల్ గా సినిమా చూపిస్తూ.. చివరలో మంచి సందేశాన్ని చెప్పాడు దర్శకుడు. ఇలాంటి కథతో సినిమా చేసిన నిర్మాత బి శ్రీనివాస రెడ్డికి మంచి అభిరుచి ఉందని చెప్పుకోవాలి. అటు యువతకు నచ్చేలా.. ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ఇబ్బంది పడకుండా చక్కటి సినిమాను తెరకెక్కించారు.

Star Heroin’s: హీరోలతో సమానంగా క్రేజ్.. లెక్క మార్చేస్తున్న హీరోయిన్స్!

నటీనటులు:
పూర్ణ నటన సినిమాకి చాలా ప్లస్ పాయింట్. కొత్త నటినో.. లేక బాష తెలియని నటినో తీసుకొని మరింత మసాలా యాడ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించ వచ్చు. కానీ, మేకర్స్ పూర్ణను తీసుకొని గుడ్ సెలక్షన్ అనిపించుకున్నారు. ఈ సినిమాకు హైలైట్ పూర్ణనే. ఇల్లాలు అంజలి పాత్రలో హుందాగా నటిస్తూనే.. వయసులో కోరికలను అణుచుకోలేని స్త్రీగా మెప్పించింది. హద్దులు దాటమనే వయసుకు.. తప్పని చెప్పే మనసుకు మధ్య నలిగే హౌస్ వైఫ్ గా అద్భుతమైన హావభావాలు చూపించింది. ఆమె క్యారెక్టర్ లో ప్రతి ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అరుణ్ క్యారెక్టర్ లో తేజ ఉత్సాహంగా నటించాడు. ఒక సగటు యువకుడు.. వయసులో యువకుడు స్త్రీ విషయంలో ఎంత బలహీనంగా ఉంటాడో.. తన కోరికను తీర్చుకోడం కోసం ఎంత ఫ్లర్టింగ్ ట్రైల్స్ చేస్తాడో తేజ నటనలో కనిపించింది. ఇక, మిగతా వాళ్ళు ఇచ్చిన పాత్రను చేసుకుపోయారు.

Bigg Boss 5 Telugu: సిరి-షణ్నుల రిలేషన్‌.. విన్నర్ సన్నీ కామెంట్స్ వైరల్!

సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ, సంగీతం వంటి టెక్నికల్ అంశాలు చాలా బలంగానే అనిపిస్తాయి. ముఖ్యంగా అంజలి, అరుణ్ కలిసే ఇంటిమేట్ సీన్స్ ను సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ నారోజ్ మరింత బ్యూటిఫుల్ గా పిక్చరైజ్ చేశాడు. పాటల్లో యుగాల భారత స్త్రీని పాట అంతర్మథనంతో సాగితే.. రారా నన్ను పట్టేసుకుని మంచి రొమాంటిక్ సాంగ్ గా ఆకట్టుకుంది. కమర్షియల్ అంటే మరీ విచ్చలవిడిగా లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన సినిమా కావడంతో యూత్ ఫుల్ అంశాలను దట్టించలేదు. రొమాంటిక్ కమ్ మెసేజ్ సినిమా కావడంతోనే సెన్సార్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది. ఏదో వీకెండ్ సినిమా చుద్ద్దాం అనుకుంటే సరదాగా వెళ్లి చూడొచ్చు అంతే!